Thursday 10 March 2022

చర్చనీయాంశంగా మారిన సమంత పెళ్లి చీర మ్యాటర్.. ఇంత స్ట్రాంగ్ డిసీజన్ తీసుకుందా?

ఇదిగో పులి అంతే అదిగో తోక అనేవారు బోలెడంత మంది ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల తాలూకు విషయాల్లో ప్రతిచిన్న విషయాన్ని కూడా బూతద్దంలో పెట్టి పెద్దది చేస్తుంటారు. అలా హీరోహీరోయిన్లపై నిత్యం షికార్లు చేసే రూమర్లు బోలెడన్ని. అయితే అలాంటి వార్తల్లో కొన్ని మాత్రం నిజమవుతుంటాయి కాబట్టే గాసిప్స్‌కి అంత డిమాండ్. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా మ్యాటర్ వైరల్ అవుతోంది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన రీసెంట్‌గా ఆయనతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ ఒక్కటైన ఈ జంట.. నాలుగేళ్ల పాటు వివాహ బంధాన్ని కొనసాగించి చివరకు డివోర్స్ తీసుకున్నారు. చై-సామ్ విడాకుల ప్రకటన ఇరువురి అభిమానులకు షాకిచ్చింది. ఇక డివోర్స్ తర్వాత సమంతనే ఎక్కువగా ఫోకస్ అయింది. అందరు ఆ చేదు జ్ఞాపకాలు మరిచేలా తన రెగ్యులర్ ఫొటోస్, పాజిటివ్ కొటేషన్స్ షేర్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నాగ చైతన్యకు సంబంధించి తన వద్ద ఉన్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయాలని ఫిక్స్ అయిన సామ్, తన పెళ్లి చీర సహా అన్నీ తిరిగి ఇచ్చేసిందనే సమాచారాలు తెగ షికారు చేస్తున్నాయి. కుటుంబం నుంచి వచ్చిన అనేక విలువైన వస్తువులను సమంత తిరిగి పంపిందనే టాక్ నడుస్తోంది. అక్కినేని కుటుంబ సభ్యులు వాటి గురించి మాట్లాడకపోయినా సమంత మాత్రం వాటన్నింటినీ తిప్పి పంపిందనేది లేటెస్ట్ సమాచారం. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే నాగచైతన్యతో సంబంధం ఉన్న ఏ రకమైన వస్తువులు కూడా తన వద్ద ఉంచుకోవడం సమంతకు ఇష్టం లేదనేది మాత్రం స్పష్టమవుతోంది. కాగా, పెళ్లి రోజు సమంత ధరించిన చీరకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ శారీ దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే నాగ చైతన్య అమ్మమ్మది. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలకు గౌరవ సూచకంగా ఈ చీరను చీరను సమంత పెళ్లి రోజు కట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ASTo2UC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...