Thursday, 10 February 2022

Khiladi Twitter Review: సినిమాపై ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘’. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. యాంకర్ అనసూయ, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ నేడు (ఫిబ్రవరి 11) ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే గత రాత్రి ఓవర్‌సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఖిలాడి ఫస్టాఫ్ అంతా కూడా కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలతో నడిచిపోయిందని, డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో ప్రీ ఇంటర్వెల్ మార్క్ కనిపించింది అని అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం ఊహించినంత గ్రాండ్‌గా లేదని చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఫస్టాఫ్ అయితే పెద్దగా వర్కవుట్ కాలేదని ఇప్పటివరకు వచ్చిన ట్వీట్ల ద్వారా స్పష్టమవుతోంది. ఇకపోతే సెకండాఫ్ లోకి ఎంటరయ్యాక కథ నడిచిందట. రవి తేజ- డింపుల్ హయతి లవ్ ట్రాక్, సాంగ్స్ పర్వాలేదనిపించాయి అనేది కొందరు నెటిజన్స్ చెబుతున్న మాట. చిత్రంలో హీరోహీరోయిన్లు రవితేజ, డింపుల్ హయతి నటన బాగుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫుల్ కిక్కు పాట, లిప్ లాక్ సీన్ ఊపు తెప్పించిందట. మొత్తంగా చూస్తే ఈ 'ఖిలాడి' సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిందనే చెప్పుకోవాలి. మరికొద్దిసేపట్లో సమయం పూర్తి రివ్యూ, సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురానున్నాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Fcn62xE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...