Wednesday, 16 February 2022

Dj Tillu 4 Days Collections: అట్లుంటది మనతోటి.. మొత్తానికి ప్రూవ్ అయిందిలే!!

కంటెంట్ ఉండి యూత్ ఆడియన్స్ మెచ్చే సినిమాలకు మంచి విజయం దక్కుతుందని నిరూపించింది Dj Tillu. 'అట్లుంటది మనతోని' అంటూ థియేటర్స్‌లో అడుగుపెట్టిన తొలి రోజే బాక్సాఫీస్ దుమ్ముదులిపాడు. అదే కంటిన్యూ చేస్తూ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేశాడు. తొలి నాలుగు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళాడు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా ఈ సినిమా తెరకెక్కింది. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తొలి షోకే జనాల తాకిడి కనిపించింది. తొలి షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌లో దూసుకుపోతున్నాడు Dj Tillu. అన్ని ఏరియాల్లో అంచనాలను మించి కలెక్షన్స్ రాబడుతున్నాడు. ఈ నాలుగు రోజుల్లో టోటల్ కలెక్షన్స్ చూస్తే.. డే 1: 3.18 కోట్లు డే 2: 2.62 కోట్లు డే 3: 1.40 కోట్లు డే 4: 1.09 కోట్లు టోటల్ AP- TG: 8.29 కోట్లు (14.70 కోట్ల గ్రాస్) DJ Tillu 4th డే AP- TG కలెక్షన్స్ నైజాం: 55 లక్షలు సీడెడ్: 15 లక్షలు ఉత్తరాంధ్ర: 12 లక్షలు ఈస్ట్ గోదావరి: 6 లక్షలు వెస్ట్ గోదావరి: 5 లక్షలు గుంటూరు: 6 లక్షలు కృష్ణా: 6 లక్షలు నెల్లూరు: 4 లక్షలు టోటల్ నాలుగో రోజుకు గాను 1.09 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. మరోవైపు అమెరికాలో కూడా డీజే టిల్లు సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 7.70 కోట్లు చేసింది. ఫస్ట్ డే మంచి రెస్పాన్స్‌ రావడంతో తొలివారం లోపే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ప్రెజెంట్ రన్ చూస్తుంటే ముందు ముందు మరిన్ని లాభాలు వస్తాయని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Hrt49uo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...