వైవిద్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది '' మూవీ. వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నిస్తూ ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఈ సినిమా నుంచి '' సాంగ్ రిలీజ్ చేశారు. వాలెంటైన్స్ డే స్పెషల్ ట్రీట్‌గా ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ''శ్రీమద్ రామా రమణ గోవిందో హార్.. ప్రేమంటే భద్రం కొడుకో.. పారాహుషార్'' అంటూ సాగిపోతున్న ఈ పాటను డిఫరెంట్ టోన్‌తో అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. కళ్యాణ చక్రవర్తి సాహిత్యాన్ని సమకూర్చగా.. మణిశర్మ సమకూర్చిన క్యాచీ ట్యూన్స్ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. ఇక ఈ లిరికల్ వీడియోలో సినిమా మేకింగ్ విజువల్స్‌ను జోడించారు. టీం అంతా కలిసి సరదాగా షూటింగ్ చేసినట్టు కనిపిపిస్తోంది. ఇటీవల విడుదలైన బలమెవ్వడు టీజర్, మరకతమణి ఎం.ఎం.కీరవాణి పాడిన టైటిల్ సాంగ్.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయని, నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైందని దర్శకనిర్మాతలు తెలిపారు. హీరో హీరోయిన్స్, ఫృథ్విరాజ్, సుహాసిని గార్ల నటన, కథ, డైలాగ్స్ ఈ బలమెవ్వడు సినిమాకు ప్రధాన బలాలు కానున్నాయట. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/b3av91U
v
No comments:
Post a Comment