Friday, 18 February 2022

చిరంజీవి, మోహన్ బాబు మధ్య వైరం? నోరువిప్పిన టాలీవుడ్ దర్శకుడు

చిరంజీవి, మధ్య వైరం నడుస్తోందా? అనే విషయమై సినీ వర్గాల్లో ఎక్కడో చోట ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. టాలీవుడ్ సీనియర్ నటులుగా కళామతల్లికి సేవలందిస్తున్న ఈ ఇద్దరూ ఎప్పటికీ టామ్ అండ్ జెర్రీలా కనిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో 'మా' విషయమై జరిగిన పరిణామాలు, రీసెంట్‌గా ఏపీ ముఖ్యమంత్రితో భేటీ కావడం లాంటి ఇన్సిడెంట్స్ పలు చర్చలకు తావిచ్చాయి. మోహన్ బాబు, చిరంజీవి మధ్య మళ్ళీ విభేదాలు తలెత్తాయా? అనే అనుమానాలు రేకెత్తించాయి. ఈ పరిస్థితుల నడుమ టాలీవుడ్ దర్శకుడు ఈ విషయంపై తన వర్షన్ తెలిపారు. చాలారోజుల తర్వాత మోహన్ బాబు లీడ్ రోల్‌లో 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ రూపొందింది. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రోమోకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మనమంతా విన్నాం. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ చిరంజీవి, మోహన్ బాబు స్నేహ బంధంపై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు డైమండ్ రత్నబాబు. ఈ మూవీలో ఉన్నత భావాలు గల మోహన్ బాబు పాత్రని పరిచయం చేస్తూ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ఉండాలని ప్లాన్ చేసుకున్నామని, చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించాలన్న ఆలోచన తనదే అని రత్నబాబు అన్నారు. చిరంజీవి పేరు చెప్పగానే మోహన్ బాబు ఓకే అన్నారని, అలాగే ఈ విషయం చిరంజీవితో మోహన్ బాబు ఫోన్ చెప్పగానే ఆ మరుసటి రోజే వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చారని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య అంతటి స్నేహబంధం ఉందని రత్నబాబు తెలిపారు. వాళ్లిద్దరిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్పేది ఏంటంటే.. మోహన్ బాబు, చిరంజీవి మధ్య స్నేహ సంబంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని రత్నబాబు అన్నారు. ఆ ఇద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారని, మధ్యలో వీళ్లు విడిపోయార్రా అని అనుకునే వాళ్లే భ్రమల్లో తేలుతుంటారని ఆయన చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/zgjUFx7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...