Saturday, 19 February 2022

‘రాధే శ్యామ్’ ట్రైలర్‌కి రంగం సిద్ధం... డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా షురూ!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌బాస్ క‌థానాయ‌కుడిగా రూపొందిని లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్‌’. పీరియాడిక్ ల‌వ్ స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. బాహుబ‌లితో పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న త‌ర్వాత ప్ర‌భాస్ చేసిన సినిమా ఒక‌టి మాత్రమే. అది కూడా సాహో చిత్రమే. దీని త‌ర్వాత మొద‌లు పెట్టిన క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ ఎట్ట‌కేల‌కు మార్చి 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, ప్రోమోలు, పాట‌లు అన్నీ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బాగా న‌చ్చేశాయి. సినిమా కోసం వారెంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా పూర్త‌య్యింది. ఇక మెయిన్ మూవీ ప్ర‌మోష‌న్స్ ప్రారంభం కావాల్సి ఉన్నాయి. మ‌రి ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ప్ర‌భాస్ అండ్ టీమ్ ఎలాంటి ప్లాన్ చేసుకుంటారో వేచి చూడాలి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ‘రాధే శ్యామ్’ మూవీ ట్రైల‌ర్‌ను మార్చి 2న విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని టాక్ సినీ సర్కిల్స్‌లో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుందట‌. ఈ చిత్రంలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. పూజా హెగ్డే ప్రేర‌ణ అనే టీచ‌ర్ పాత్ర‌లో మెప్పించ‌నుంది. త‌న ప్రేమ‌కు, ప్రేయ‌సి ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను ముందుగానే గుర్తించిన విక్ర‌మాదిత్య త‌న ప్రేమ‌ను ఎలా బ‌తికించుకున్నాడ‌నేదే సినిమా క‌థాంశం అని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. గోపీ కృష్ణా మూవీస్ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడిగా యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు కూడా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/v8caAoO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...