Tuesday, 1 February 2022

బాలకృష్ణతో 'నారప్ప' దర్శకుడి స్కెచ్.. తెరవెనుక దిల్ రాజు!

'అఖండ' విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. 'అఖండ' సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే మరో సినిమా చేయబోతున్నారట బాలయ్య. 'క్రాక్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ కోసం పదునైన కథ సిద్ధం చేశారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అయితే దీంతో పాటు గానే ఇతర సినిమాలు కూడా పూర్తి చేసి వరుస సినిమాలతో నందమూరి అభిమానులను అలరించాలని ఫిక్సయ్యారట బాలకృష్ణ. ఈ మేరకు ఇప్పటికే అనిల్ రావిపూడితో ఓ సినిమాకు ఓకే చెప్పిన అయన, తాజాగా చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. రీసెంట్‌గా వెంకటేష్ హీరోగా 'నారప్ప' సినిమా చేసి హిట్ ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల.. బాలకృష్ణ కోసం ఓ పదునైన కథను రెడీ చేశారట. ఈ కథను విన్న బాలయ్య వెంటనే ఓకే చెప్పారని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని, చాలా గ్రాండ్‌గా ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం నటీనటుల వేట షురూ చేశారట. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సో.. చూస్తుంటే ఈ ఏడాది కూడా వెండితెరపై బాలయ్య బాబు హంగామాకు కొదవేలేదు అనిపిస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/NIu5L6Vxc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...