Monday, 21 February 2022

భీమ్లా నాయక్ ట్రైలర్‌‌పై శ్రీ రెడ్డి రియాక్షన్.. వైరల్ అవుతున్న మెసేజ్

ప్రస్తుతం 'భీమ్లా నాయక్' మేనియా కొనసాగుతోంది. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేసి చివరకు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా భీమ్లా నాయక్ ట్రైలర్ వదలడంతో ఈ వీడియో ఆన్ లైన్‌లో సునామీ సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ యాక్షన్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పూనకాలు తెప్పించే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్‌పై కామెంట్ వదిలింది సంచలన తార . పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఎన్నో విషయాల్లో శ్రీ రెడ్డి వేలుపెడుతుండటం చూస్తుంటాం. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ముందుకొచ్చి 'భీమ్లా నాయక్' ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ భీమ్లా నాయక్ ట్రైలర్ అనుకున్నంతగా లేదంటూ నెగెటివ్ కామెంట్ చేసింది. అంతేకాదు బిలో యావరేజ్ అంటూ గాలి తీసేసింది. దీంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై చేసే కామెంట్స్ అబ్బో మాటల్లో చెప్పలేం. భీమ్లా నాయక్ రిలీజ్‌కి ముందు భారీ రేంజ్ ప్రమోషన్స్ చేపడుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు కానీ ఏపీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణంతో అది పోస్ట్ పోనే చేశారు. అయితే అదేరోజు ట్రైలర్ మాత్రం వదిలి పవన్ అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. మలయాళీ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమన్ బాణీలు కట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/yUne9Ym
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...