Thursday, 10 February 2022

ఎన్టీఆర్ పర్సనాలిటీపై దీపిక పదుకొనే కామెంట్స్.. ఆ మాట చెబుతూ ఓపెన్!

క్రమంగా తెలుగు సినీ పరిశ్రమ క్రేజ్ పెరుగుతూ వస్తోంది. వరుస ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. దర్శకనిర్మాతలు సైతం భారీ బడ్జెట్ కేటాయించి సినిమాలు రూపొందిస్తూ యావత్ భారతదేశం చూపు తెలుగు సినీ పరిశ్రమపై పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటేనే బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు బీటౌన్ స్టార్స్ తెలుగుతెరపై కాలుమోపగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెలుగు స్టార్ హీరోలపై తన ఫీలింగ్స్ బయటపెట్టింది. 'బాహుబలి' సిరీస్‌తో తెలుగోడి సత్తా ఎల్లలు దాటింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆలియా భట్ RRR సినిమాలో నటిస్తుండగా.. ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ K చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీపిక పదుకొనే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది దీపిక. తన తాజా చిత్రం 'గెహ్రియాన్' సినిమా రిలీజ్ నేపథ్యంలో ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక.. తనకు ఎన్టీఆర్ పర్సనాలిటీ ఇష్టం అంటూ ఓపెన్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ తనకు బాగా నచ్చుతాయని, ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటూ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ అంటే లైక్ అని చెబుతూ బన్నీపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది. తెలుగులో చూస్తే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలపైనే తన ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు ఆమె తెలిపింది. 'గెహ్రియాన్' సినిమా విషయానికొస్తే అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ అయింది. తన సిస్టర్ బాయ్ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం కలిగి ఉన్న క్యారెక్టర్‌లో ఆమె కనిపించింది. ఈ సినిమాలో దీపికా రోల్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉందని, రొమాన్స్ సీన్స్ అదిరిపోయాయనే టాక్ వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Qmk7E6G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...