Saturday, 12 February 2022

నరేష్‌ కోరికను చాంబర్‌ పట్టించుకుంటుందా?

కేవలం సినిమాల ప్రమోషన్‌ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీ యాక్టివిటీ ఇప్పుడు అంతకు మించి అన్నట్టు ఉంది. మా ఇష్యూ చెలరేగినట్టే రేగి, ఎన్నికలు ముగియడంతో కాస్త సర్దుమణిగింది. ఆ తర్వాత కూడా గెలిచిన సభ్యుల రాజీనామాలు, వాటిని ఆమోదించడం, ప్రభుత్వ పెద్దలను కలవడం ఇలా కొన్నాళ్లు రకరకాల విషయాలు వినిపించాయి. అయితే ఏపీలో టిక్కెట్‌ ధరల ఇష్యూ తెరమీదకు రావడంతో మిగిలినవన్నీ పక్కకెళ్లిపోయాయి. కేవలం టిక్కెట్‌ ఇష్యూ మాత్రమే ప్రధానంగా వార్తలు నడిచాయి. అయితే టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు మహేష్‌, ప్రభాస్‌ను వెంటబెట్టుకుని మెగాస్టార్‌ చిరంజీవి విజయవాడకు వెళ్లి ఏపీ సీఎం వై.యస్‌. జగన్‌ని కలిసిన తర్వాత పరిస్థితి మరోలా మారింది. టిక్కెట్‌ రేట్ల గురించి వారం పదిరోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని మెగాస్టార్‌ స్వయంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగిన పేర్నినాని - మంచు ఫ్యామిలీ మీటింగ్‌, దాని గురించి చేసిన ట్వీట్లు... కూడా జనాల్లో ఆసక్తిరేకెత్తించాయి. ఆ విషయం అలా చల్లబడిందో లేదో, ఇప్పుడు లేటెస్ట్ గా నటుడు వీకే నరేష్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఏపీ సీఎంతో జరిగిన మీటింగ్‌ గురించి పాజిటివ్‌గా స్పందించారు నరేష్‌. అయితే అంతకన్నా ముందు ఫిల్మ్ చాంబర్‌ ఇప్పుడు ఓ వర్క్ షాప్‌ని కండక్ట్ చేయాలని కోరారు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందున్న సవాళ్లేంటి? అసలు ఇండస్ట్రీకి ఏం కావాలి? అసలున్న సమస్యలేంటి? వాటికి తగ్గ పరిష్కారాలేంటి? వంటి వివరాలతో వర్క్ షాప్‌ నిర్వహిస్తే బావుంటుందని అన్నారు. అంతే కాదు, పరిశ్రమ యూనిటీకి ఇది ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. ప్రభుత్వాల ముందు, ప్రజల ముందు తెలుగు సినిమా పరిశ్రమ ఐక్యతకు గౌరవం దక్కుతుందని అన్నారు. నరేష్‌ కోరికను ఫిల్మ్ చాంబర్‌ పట్టించుకుంటుందా? స్పందిస్తుందా? వెయిట్‌ చేసి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/goEvxLY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...