Friday, 11 February 2022

అప్పుడలా ఇప్పుడిలా.. హీరో విశాల్‌కు గాయాలు

ప్రస్తుతం ఒక హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. డిటెక్టివ్, అభిమన్యుడు తరువాత ఆ స్థాయి సక్సెస్ రావడం లేదు. పందెం కోడి 2, ఎనిమి, సామాన్యుడు ఇలా ఎన్ని రకాల సినిమాలు చేసినా కూడా వర్కవుట్ అవ్వడం లేదు. విశాల్‌కు మంచి హిట్ పడటం లేదు. అయినా కూడా విశాల్ మాత్రం తన పంథాలో తాను పోతోన్నాడు. హిట్ కొట్టేందుకు వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పుడు విశాల్ అనే ఓ పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నాడు. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్‌ను విశాల్ తాజాగా ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్‌లో విశాల్‌కు గాయాలయ్యాయి. గతంలోనూ ఇలానే సినిమా షూటింగ్ సమయంలో విశాల్‌కు గాయాలయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి విశాల్‌కు గాయాలయ్యాయి. సామాన్యుడు సినిమా షూటింగ్, ఫైట్ సీక్వెన్స్‌లో విశాల్‌కు గాయాలయ్యాయి. ఇక ఇప్పుడు లాఠీ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లో విశాల్‌కు తీవ్రంగానే గాయాలైనట్టు కనిపిస్తోంది. ఇక చేతికి గాయం అవ్వడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు విశాల్ ట్వీట్ వేస్తూ వీడియోను రిలీజ్ చేశాడు. లాఠీ సినిమా షూటింగ్ సమయంలో అనేక గాయాలు అయ్యాయి. ఫైటింగ్ సీక్వెన్స్‌లో ఇదంతా జరిగింది. ఇప్పుడు కేరళకు వెళ్తున్నాను. కాస్త బ్రేక్ ఇచ్చాం. మార్చి మొదటి వారంలో జరిగే షెడ్యూల్‌లో మళ్లీ పాల్గొంటాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. త్వరగా కోలుకోవాలంటూ విశాల్ అభిమానులు కోరుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/kJY2EfV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...