Monday, 14 February 2022

బాల‌కృష్ణ సినిమాలో కుర్ర హీరోయిన్‌.. కానీ అస‌లు ట్విస్ట్ అదే!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆల్ రెడీ లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రంలో సెట్స్ పైకి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. దీని త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్ చల్ చేస్తున్నాయి. నిజానికి బాల‌కృష్ణ 101వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయాల్సింది. కానీ.. ఎందుక‌నో సినిమా ట్రాక్ ఎక్క‌లేదు. అయితే బాల‌కృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేష‌న్ సంద‌డి మొద‌లు కానుంద‌ని టాక్‌. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ దానికి ఎంట‌ర్‌టైన్‌మెంట్ జోడించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు. ఆయ‌న సినిమాల ప్యాట్ర‌న్‌ను గ‌మ‌నిస్తే ఆ విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. అదే స్టైల్లో బాల‌య్య‌తో సినిమాను కూడా డిజైన్ చేసుకున్నాడ‌ట‌. F3 త‌ర్వాత అనిల్ రావిపూడి చేయ‌బోయే సినిమా ఇదేన‌ని టాక్‌. ఈలోపు బాల‌కృష్ణ కూడా గోపీచంద్ మ‌లినేని సినిమాను పూర్తి చేసుకుంటారు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ క‌నిపించ‌నున్నారని స‌మాచారం. అయితే ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇందులో క‌నిపించ‌బోయే మ‌రో హీరోయిన్ బాల‌కృష్ణ కుమార్తెగా క‌నిపించ‌నుంద‌ట‌. ఇంత‌కు బాల‌కృష్ణ కూతురిగా న‌టించ‌బోయే ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా? శ్రీలీల‌. రీసెంట్‌గా సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు మూవీ పెళ్లిసంద‌D ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ర‌వితేజ‌తో ధ‌మాకా సినిమాలో న‌టిస్తుంది. బాల‌కృష్ణ సినిమా కావ‌డంతో ఆమె కూడా ఓకే చెప్పింద‌ట‌. సీనియ‌ర్ హీరోలు ఇప్పుడు త‌మ సినిమాల్లో తండ్రులుగా క‌నిపించ‌డంలో వెనుకాడ‌టం లేదు. అయితే ఓ హీరోయిన్‌కు తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌డం అంటే చాలా గొప్ప విష‌యం. అందుకు బాల‌కృష్ణ కూడా ఓకే చెప్ప‌డం అభినందించాల్సిన విష‌యం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/GhZpMTw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...