Tuesday, 15 February 2022

రామ్ చరణ్- శంకర్ కాంబోపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. చెర్రీ అలా కనిపించబోతున్నారా?

టాలీవుడ్ నుంచి వరుసపెట్టి బిగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు బడా దర్శకనిర్మాతలు. స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తూ యావత్ భారత దేశం దృష్టి తెలుగు చిత్రసీమపై పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోగా బిగ్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేయగానే మెగా ఫ్యాన్స్‌లో ఆతృత మొదలైంది. దీనికి తోడు చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ రోల్ విషయమై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే సమాచారం ఫిలిం నగర్ నుంచి వినిపిస్తోంది. ఇందులో ఒకటి సాధారణమైన వ్యక్తి రోల్ కాగా, మరొకటి మాత్రం చాలా సీరియస్ గెటప్ అని అంటున్నారు. ఓ ఉన్నతాధికారి పాత్రలో చెర్రీ సీరియస్ రోల్ సినిమాలో హైలైట్ కానుందని, రామ్ చరణ్ పాత్రపై శంకర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట. చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో ఇదే కావడంతో దిల్ రాజు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని భారీ యాక్షన్ సీన్స్‌తో విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుంచాలనేది శంకర్, దిల్ రాజు ప్లాన్. ఇందుకు అనుగుణంగానే చిత్రీకరణ జరుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/G4BLqcD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...