నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో జోడీగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ NBK 107కి సంబంధించిన మరో అప్‌డేట్‌ను అందించింది. ప్రముఖ కన్నడ నటుడు ఇందులో నటించబోతున్నారు. NBK 107.. మూవీ జనవరి 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. 2021లో క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో డైరెక్టర్ గోపీచంద్ ఆయన క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. డైలాగ్స్ కూడా నందమూరి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించేలా రాయించారట. రీసెంట్‌గా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న గోపీచంద్ మలినేని ఈ సినిమాలో ఓ డైలాగ్‌ను బయటకు చెప్పేశారు. ‘రోడ్డు మీద జింక, గొర్రె వస్తే ఎవడైనా హారన్ కొడతాడు. అదే సింహం వస్తే హార్స్ కాదు కదా, ఇంజన్ కూడా ఆపేసి కూర్చుంటాడు’ అనేది లో డైలాగ్. పక్కా మాస్, ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది కదా. 2021లో నందమూరి బాలకృష్ణ..‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అదే స్పీడుతో తన NBK 107 షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వేటపాలెం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. నిజ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తమన్ సినిమాకు సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం మేరకు జనవరి 20 నుంచి NBK 107 సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mT0p8C
v
No comments:
Post a Comment