Monday, 10 January 2022

Hero Trailer : అదరగొట్టేసిన మహేష్ మేనళ్లుడు

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో రాబోతోన్నాడు. మహేష్ సోదరి పద్మావతి కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. గల్లా జయదేవ్ తన కొడుకు కోసం ఏకంగా ఓ బ్యానర్‌ను స్థాపించాడు. అమర్ రాజా మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి కొడుకును హీరో సినిమాతో హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ సైడ్ అవ్వడంతో ఇప్పుడు అరడజనుకు పైగా వచ్చేశాయి. అందులో కొన్ని మళ్లీ వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికైతే బంగార్రాజు, హీరో సినిమాలు బరిలో ఉన్నాయి. ఇక హీరో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. తాజాగా దర్శకధీరుడు చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేయించారు. అశోక్ గల్లా, నటించిన హీరో మూవీ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే రాజమౌళి విడుదల చేశారు. మొదటి చిత్రమే అయినా ఇందులో అశోక్ అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించినట్టు కనిపిస్తోంది. ఇందులో శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా జానర్లను ఇందులో మిళితం చేసినట్టున్నారు. అశోక్, నిధి అగర్వాల్ మధ్య రొమాంటిక్స్ సీన్స్ యూత్‌ను కట్టిపడేసేలా ఉంది. మొత్తానికి సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా మున్ముందు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చూడాలి. ఇప్పటికే ఏపీలోనైట్ కర్ఫ్యూను విధించారు. థియేటర్లలో యాభై ఆక్యుపెన్సీ నిబంధనను తీసుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f5LwLZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...