Thursday, 6 January 2022

డిజిటల్ హక్కుల్లోనూ ‘పుష్ప’ స్పీడు.. అల్లు అర్జున్ మరో రికార్డ్

ఐకాన్ స్టార్ హీరోగా డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్పటికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డంలో ఉత్త‌రాది సినిమాల‌ను క్రాస్ చేయ‌డం విశేషం. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమా రూ.300 కోట్ల‌కు మేర వ‌సూళ్ల‌ను సాధించింది. ఇంకా థియేట‌ర్స్‌లో ర‌న్ అవుతుంది. అయితే సినిమా డిజిట‌ల్‌లోనూ సంద‌డి చేయ‌డానికి రెడీ అయ్యింది. జ‌న‌వ‌రి 7న ది రైజ్ డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంద‌నే విష‌యాన్ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంత మొత్తంలో వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రం.. డిజిట‌ల్ హ‌క్కుల విష‌యంలోనూ ఓ రికార్డ్ క్రియేట్ చేసింద‌ట‌. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు సంబంధించిన డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది. ఈ హ‌క్కుల కోసం మేక‌ర్స్‌కు అమెజాన్ ప్రైమ్ రూ.22 కోట్లను చెల్లించిద‌ని టాక్‌. సినిమా విడుద‌ల త‌ర్వాత ఇంత మొత్తంలో డిజిట‌ల్ హక్కుల‌ను సంపాదించిన చిత్రంగా పుష్ప ది రైజ్ రికార్డేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. శేషాచ‌లం అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ ఆధారంగా పుష్ప సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో తొలి భాగంగా పుష్ప ది రైజ్ విడుద‌లైంది. ఇక రెండో భాగం పుష్ప ది రూల్..ఫిబ్ర‌వ‌రి నుంచి చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ర‌ష్మిక మ‌ద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించారు. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత భారీ అంచ‌నాల న‌డుము మ‌ధ్య రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G3R7y8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...