Sunday, 23 January 2022

‘భీమ్లా నాయక్’ మళ్లీ వాయిదా పడుతుందా? అందుకు వినపడుతోన్న కారణాలేంటి?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు ‘లాలా భీమ్లా..’ సాంగ్ కూడా రాశారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను ముందు ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ RRR, రాధే శ్యామ్ చిత్రాల కోసం దారిచ్చేశారు. శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ‘’ వాయిదా ప‌డుతుందని సినీ వ‌ర్గాల్లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి ఇందుకు రెండు కార‌ణాలు చెబుతున్నారు. క‌రోనా ప‌రిస్థితులు ఇంకా కంట్రోల్‌లోకి రాక‌పోవ‌డం. దీని కార‌ణంగా థియేట‌ర్స్ ఆక్యుపెన్సీ స‌మ‌స్య వ‌స్తుందా? అనేది ఒక కార‌ణ‌మైతే. సినిమా దాదాపు రెండు వారాలకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పెండింగ్‌లో ఉంద‌ట‌. పోనీ జ‌న‌వ‌రిలో పూర్తి చేద్దామా? అని అనుకుంటే క‌రోనా మూడో వేవ్ కార‌ణంగా.. షూటింగ్ జ‌రుపుకునే ప‌రిస్థితి లేదు. షూటిగంగ్ పూర్తి చేసిన త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ కంప్లీట్ కావాలంటే చ‌క చ‌కా ప‌నులు పూర్తి కావాలి. కానీ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం ప‌నులు పూర్తి కావ‌డం లేదు. దీంతో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ మ‌రోసారి వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు ఇది రీమేక్‌. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తే.. రానా రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల ఇగోల పోరుగా సినిమా ఉండ‌నుంది. ఈ చిత్రాన్నిప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు త్రివిక్ర‌మ్ మార్పులు చేర్పులు చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోడిగా నిత్యా మీన‌న్‌, రానా ద‌గ్గుబాటి జోడిగా సంయుక్తా మీన‌న్ న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tX4q0a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...