Sunday, 16 January 2022

హీరో కోసం నిధి అగర్వాల్ డిమాండ్.. ఇస్మార్ట్ బ్యూటీ స్టెప్స్‌పై సినీ వర్గాల్లో చర్చ!

సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఒకప్పటిలా నటీనటులకు వందలాది సినిమాల్లో భాగమయ్యే స్కోప్ లేకపోవడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే కొన్ని సినిమాలకే పరిమితమవుతుండటం గమనిస్తున్నాం. టాలెంట్‌తో పాటు గ్లామర్ డోస్ దట్టించినా కూడా హీరోయిన్‌గా చాలా సినిమాలు చేయడమేనేది ఈ రోజుల్లో కష్టతరమైన విషయమే అని చెప్పుకోవాలి. కాబట్టి హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించాక ఏ మాత్రం గుర్తింపు లభించినా డిమాండ్ పెంచేస్తున్నారు నేటితరం అందాల తారలు. తాజాగా ఇదే లిస్టులో చేరింది . సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో పాపులర్ అయింది. ఈ సినిమాలో నిధి అందాల ఆరబోతకు యువత అట్రాక్ట్ అయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా టాలీవుడ్ లోకి కొత్త హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ గల్లాతో 'హీరో' సినిమా చేసింది నిధి అగర్వాల్. అయితే తనకున్న పాపులారిటీ దృష్ట్యా ఈ సినిమా కోసం ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ బాగానే ఉందనే టాక్ సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కో సినిమాకు 50 నుంచి 80 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న నిధి అగర్వాల్.. 'హీరో' సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్న‌ర డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి హీరో నిర్మాతలు కూడా ఒప్పుకొని నిధి అడిగినంత ఇచ్చేశారని సమాచారం. ఆమె కెరీర్‌లోనే తొలిసారి ఇంతటి రెమ్మ్యూనరేషన్ అందుకున్న నిధి అగర్వాల్.. ముందు ముందు మరిన్ని మంచి సినిమాలతో అలరిస్తానని అంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్‌ సరసన 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా విడుదలై సక్సెస్ అయితే ఇక నిధి డిమాండ్ ఇంకెంత పెంచుతుందో చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KkjGdt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...