Monday, 10 January 2022

ప్రభాస్ పెళ్లి... క్లారిటీ ఇచ్చిన ప్ర‌భాస్ శ్రీను!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ఎవ‌రు? అనే ప్ర‌శ్న వ‌స్తే.. ముందుగా ట‌క్కున గుర్తుకొచ్చే పేరు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన మ‌న డార్లింగ్ ప్ర‌భాస్‌. నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా ఆయ‌న పెళ్లి చేసుకోలేదు. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న పెళ్లి గురించి ప‌లు ర‌కాలైన వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. కొన్ని సార్లు అయితే హీరోయిన్ అనుష్క‌ను ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నార‌ని, వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌నే వార్త‌లు కూడా బ‌లంగానే వినిపించాయి. అలాగే ఇంట్లోనే సంబంధాలు చూస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ పెళ్లి అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే వీటిపై ప్ర‌భాస్ ఏమీ రియాక్ట్ కాలేదు. ప్ర‌భాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన బాహుబ‌లి సినిమా విడుద‌లైన త‌ర్వాత పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే న‌వ్వి ఊరుకున్నారే త‌ప్ప‌.. ఏనాడు స్ట్ర‌యిట్‌గా స‌మాధానం చెప్ప‌లేదు. పెళ్లి గురించి ప్ర‌శ్న వ‌చ్చిన ప్ర‌తిసారీ దాట‌వేత ఆయ‌న ఆన్స‌ర్ అయ్యేది. మ‌రిప్పుడు వ‌రుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. మ‌రెప్పుడు పెళ్లి చేసుకుంటార‌నే ప్ర‌శ్న ఆయ‌న ఫ్యాన్స్ మ‌దిని తొలిచేస్తుంది. ఎవరినీ అడ‌గాలో తెలియ‌డం లేదు. ప్ర‌భాస్ ఏమో మీడియాకు చిక్క‌డు. చిక్కినా ఆయ‌న పెళ్లి గురించి అడిగే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేరు. ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌శ్న‌ను ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే, ఆయ‌న స్నేహితుడు, న‌టుడు అయిన ప్ర‌భాస్ శ్రీనుని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించారు. దానికి ప్ర‌భాస్ శ్రీను మాట్లాడుతూ ‘‘ఇదే ప్రశ్నను చాలా మంది వేస్తుంటారు. కానీ నువ్వు.. నేను చెబితే ప్రభాస్‌గారి పెళ్లి అయిపోదు. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అవుతుంది. ఆయ‌న పెళ్లి చేసుకుంటే ప్ర‌పంచం మొత్తం తెలుస్తుంది’’ అని తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు . ALSO READ : ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కాావాల్సింది కరోనా ప్రభావంతో వాయిదా పడింది. మరో వైపు ఆది పురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప్ర‌భాస్ స‌లార్ సినిమాను పూర్తి చేయ‌డానికి రెడీ అవుతున్నారు. మ‌రో వైపు నాగ్ అశ్విన్ దర్వ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కె సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే ప్ర‌భాస్ 25వ చిత్రం ‘స్పిరిట్‌’.. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందడానికి ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ALSO READ :


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zGUHMh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...