Tuesday, 11 January 2022

మెగా అప్‌డేట్.. చిరంజీవితో జోడీ కట్టబోతున్న అనుష్క! ఫైనల్ అయినట్లేనా..?

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది . బాహుబలి లాంటి భారీ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా ఇమేజ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత కెరీర్ పరంగా కాస్త నెమ్మదిగా అడుగులేస్తోంది. సెలెక్టెడ్ సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలతో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు కూడా కేరాఫ్ అడ్రస్ తానే అని పేరు తెచ్చుకున్న స్వీటీ.. 'నిశ్శబ్దం' మూవీ తర్వాత మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజా అనుష్కకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా అనుష్క చేయబోతున్న సినిమాలపై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాను లైన్‌లో పెట్టిన అనుష్క.. మరో భారీ సినిమాలో భాగమయ్యేందుకు రెడీ అవుతోందట. సీనియర్ హీరోయిన్లతో తెర పంచుకుంటూ ఇప్పటికీ తన స్టామినా ప్రూవ్ చేసుకుంటున్న మెగాస్టార్ చేయబోతున్న కొత్త సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంతో కాజల్ జోడీగా 'ఆచార్య' షూటింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్.. 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార జంటగా నటిస్తున్నారు. అలాగే 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి జోడీగా తమన్నా సందడి చేయనుంది. ఇకపోతే బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న కొత్త సినిమాలో చిరంజీవి జంటగా శృతి హాసన్ నటించనుందట. ఈ క్రమంలోనే చిరంజీవితో జోడి కట్టే లిస్టులో అనుష్క కూడా చేరిందని సమాచారం. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి రీసెంట్‌గా వెంకీ కుడుములతో కొత్త సినిమా ప్రకటించారు. దీంతో ఈ సినిమా నటీనటులు, చిరంజీవితో తెరపంచుకునే హీరోయిన్ విషయమై ఎన్నో రకాలుగా ఆలోచించిన .. చివరకు అనుష్క పేరును ఫైనల్ చేశారట. ఇప్పటికే అనుష్కతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, అనుష్క కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యిందనే టాక్ నడుస్తోంది. సో.. చూడాలి మరి ఈ మెగా కాంబోపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tjWxSn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...