Sunday, 2 January 2022

దీప్తితో బ్రేకప్ అనంతరం మొదటి పోస్ట్.. గుండె బద్దలైందన్న షన్ను

ప్రేమలు, బ్రేకప్పులు ఇప్పుడు సహజంగా మారిపోయాయి. ప్రేమలో ఎంత త్వరగా పడుతున్నారో.. అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుని బంధానికి ముగింపు పలికేస్తున్నారు. అలా తాజాగా దీప్తి సునయన, స్టోరీ ఎక్కువగా వైరల్ అవుతోంది. బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం షన్ను కోసం అండగా నిల్చుంది. అయితే బిగ్ బాస్ షో అనంతరం మాత్రం అసలు సంగతి మొదలైంది. అందరూ హ్యాపీగా కలుస్తున్నారు.. పోస్ట్‌లు పెడుతూ నానా హంగామా చేశారు. కానీ దీప్తి షన్ను, సిరి శ్రీహాన్ జోడీలు మాత్రం నెట్టింట్లో కనిపించలేదు. దీంతో గ్యాప్ వచ్చినట్టుంది, విడిపోయారేమో, మనస్పర్థలు వచ్చి ఉంటాయేమోనని నెటిజన్లు కామెంట్లు చేసుకుంటూ వచ్చారు. చివరకు ఆ రూమర్లే నిజమయ్యాయ్. షన్నుతో ఉండలేమని, ఇకపై కేవలం స్నేహితులుగానే కొనసాగుతామంటూ దీప్తి సునయన ఓ సుధీర్టమైన పోస్ట్ చేసింది. అందులో షన్నుతో బ్రేకప్ గురించి క్లియర్‌గా వివరించింది. ఇక షన్ను సైతం దీప్తి సునయన సంతోషాన్నే కోరుకున్నాడు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా సరే సంతోషంగా ఉంటే చాలు అంటూ షన్ను తెలిపాడు. అయితే ఈ బ్రేకప్ అనంతరం షన్ను మొదటగా ఓ పోస్ట్ వేశాడు. ఇందులో రెండు హార్ట్ సింబల్స్‌ను షేర్ చేశాడు. గుండె బద్దలైందన్నట్టుగా ఓ రెండు బ్రోకెన్ హార్ట్ సింబల్‌లను షేర్ చేశాడు. అయితే షన్ను మొహంలో మాత్రం బ్రేకప్ బాధ కనిపించడం లేదు. కానీ అదే దీప్తి సునయన అయితే.. అలా లైవ్‌లోకి వచ్చి ఈ బ్రేకప్ బాధను భరించలేక వెంటనే కన్నీరు పెట్టేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FZFrMM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...