Wednesday, 5 January 2022

సాయిపల్లవిని పక్కన పెడుతున్న శేఖర్ కమ్ముల.. తప్పడం లేదా?

కొన్ని కాంబినేష‌న్స్‌ను ఆడియెన్స్ హిట్ కాంబినేష‌న్ అనుకుంటారు. సాధారణంగా ఈ మాట‌ హీరో - హీరోయిన్ లేదా హీరో - డైరెక్ట‌ర్ అనే సంద‌ర్భాల్లోనే ఎక్కువ‌గా వినిపిస్తుంది. అయితే ఓ డైరెక్ట‌ర్, హీరోయిన్ విష‌యంలోనూ హిట్ కాంబినేష‌న్ పేరు ఎక్కువ‌గా వినిపించింది. అదెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫిదా, ల‌వ్‌స్టోరి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల కోలీవుడ్ హీరో ధ‌నుష్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్‌కి హిందీలోనూ క్రేజ్ ఉండ‌టంతో హిందీలోనూ సినిమా రిలీజ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌న తెలుగు నిర్మాత‌లు సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ధ‌నుష్ - శేఖ‌ర్ క‌మ్ముల సినిమా స్క్రిప్ట్ ప‌నులు పూర్త‌యితే ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌వినే తీసుకుంటార‌ని వార్త‌లు వినిపించాయి. ఎందుకంటే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఫిదా, ల‌వ్ స్టోరి సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం ఒక‌టైతే, మ‌రో వైపు ధ‌నుష్ - సాయి ప‌ల్ల‌వి కాంబోలో రూపొందిన మారి 2 సినిమాలో రౌడీ బేబి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. కానీ లేటెస్ట్‌గా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా తీసుకోవ‌డం లేద‌ట‌. సినిమాను హిందీలో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు కాబ‌ట్టి, బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకుంటే అక్క‌డ మార్కెట్ ప‌రంగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది నిర్మాత‌ల ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంద‌ట‌. మార్కెట్ ప్ర‌కారం నిర్మాత‌లు ఆలోచ‌న క‌రెక్టే అయినా, హిట్ కాంబినేష‌న్ అనేది కూడా చూసుకుంటే సినిమాపై క్రేజ్ ఉంటుంది క‌దా అనేది ఫ్యాన్స్ వాద‌న‌. అయితే త్వ‌ర‌లోనే హీరోయిన్ విష‌యంలో ఓక్లారిటీ రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pYYyBm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...