Tuesday, 4 January 2022

బ్రేకింగ్: సంక్రాంతి రేస్ నుంచి రాధే శ్యామ్ అవుట్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన యూనిట్

భారీ అంచనాల నడుమ హీరోగా తెరకెక్కిన '' సినిమా విడుదలను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చేసింది చిత్రయూనిట్. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాల్సిన ఈ సినిమాను కోవిడ్ వ్యాప్తి కారణంగా వాయిదా వేయక తప్పడం లేదంటూ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ''గత కొన్ని రోజులుగా రాధే శ్యామ్ సినిమా విడుదల కోసం చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాం. కానీ క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా అందరి సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను వాయిదా వేస్తున్నాం. సినిమాపై మీ ఆదరణ, ప్రేమ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. అతిత్వరలో మరో విడుదల తేదీని ప్రకటిస్తాం'' అని యూవీ క్రియేషన్స్ బ్యానర్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసేందుకు భారీ ఎత్తున సిద్ధమయ్యాయి ప్యాన్ ఇండియా మూవీస్ ''RRR, రాధే శ్యామ్''. అయితే కరోనా దాడి మరోసారి ఎక్కువ కావడం, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రీసెంట్‌గా RRR వాయిదాను అధికారికంగా దృవీకరించగా.. తాజాగా 'రాధే శ్యామ్' యూనిట్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ ‘రాధే శ్యామ్’ సినిమా రూపొందించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ సినిమాను నిర్మించగా.. చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడిగా విలక్షణ పాత్ర పోషించారు ప్ర‌భాస్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ETVOcr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...