Wednesday, 5 January 2022

కూతురి కోసం ముందుకు వచ్చిన చిరు!.. ఇదెంతో పెద్ద విషయమన్న సుష్మిత

మెగా డాటర్ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తోంది. జీ5, ఆహా కోసం స్పెషల్ ప్రాజెక్ట్‌లను చేస్తోంది. షూట్ అవుట్ ఎట్ ఆలేర్ అంటూ శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణంతో చేసిన వెబ్ సిరీస్ బాగానే క్లిక్ అయింది. ఇక ఇప్పుడు సేనా పతి అంటూ ముందుకు వచ్చింది. సేనాపతిని వీక్షించిన చిరు తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ‘ సినిమా చూశాను.. యువ దర్శకుడు పవన్ సాదినేని ఎంతో ఆసక్తికరంగా, అనుక్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠభరితంగా ఉండేలా తీశాడు. మంచి అభిరుచికి అద్దం పట్టే చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు సుష్మిత కొణిదెలకి, విష్ణులకు నా ప్రేమాభినందనలు. అన్నింటికి మించి సీనియర్ నటుడు నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఒక వినూత్న పాత్రలో అద్భుతంగా నటించాడు. తన నటనా ప్రతిభకు ఈ చిత్రం ఓ మచ్చుతునక. ఈ ప్రయత్నం వెనుకు ఉన్న గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ టీ అందరికీ నా శుభాకాంక్షలు.. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదలైన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఇలా కూతురి కోసం ముందుకు రావడం, సినిమా గురించి నాలుగు ముక్కలు మంచి మాటలు చెప్పడంతో ఎంతో ప్రోత్సహించినట్టు అయింది. ఇదే విషయాన్ని చిరు పెద్ద కూతురు సుష్మిత చెప్పుకొచ్చింది. ఇలాంటి సందేశాలతో ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ డాడీ.. ఈ మెసెజ్ మాకు ఎంతో గొప్ప విషయం అని చెప్పుకొచ్చింది. మొత్తానికి సేనాపతి సినిమాతో నిర్మాతగా సుష్మిత మరో హిట్ అందుకున్నట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eVeMF4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...