Thursday, 13 January 2022

ఇద్దరికీ ఆయనే కావాలట! హైపర్ ఆది కోసం హీరోయిన్ల పోట్లాట.. వీడియో వైరల్

జబర్దస్త్ రాకతో ప్రతి ఇంట బుల్లితెర హంగామా రెట్టింపయింది. ఈ వేదికపై కమెడియన్లు చేసే కామెడీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఏళ్ళ తరబడి ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండటమే గాక ఎక్స్‌ట్రా జబర్దస్త్, పండగ స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటూ తెగ నవ్విస్తున్నారు బుల్లితెర కమెడియన్స్. కేవలం ఈ షోతో భారీ పాపులారిటీ దక్కించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే హైపర్ ఆది. పంచ్ అనేది లేనిదే అసలు మాటే బయటకు రానీయని ఈ కమెడియన్ కోసం ఇద్దరు హీరోయిన్లు పోట్లాడుకోవడం జరిగింది. ఇంతకీ అదెక్కడ? దీనిపై ఫీలింగ్స్ ఏంటి? అనేది చూద్దామా.. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయ్యారు జబర్దస్త్ కమెడియన్స్. వెరైటీ కాన్సెప్ట్‌లతో పండగ రోజు హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసిన మేకర్స్.. అందుకు సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా బయటకు వదులుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా '' అనే పేరుతో జనవరి 15న ప్రసారం చేయబోతున్న షో ప్రోమో రిలీజ్ చేయగా అందులో హైపర్ ఆది కోసం సీనియర్ హీరోయిన్లు , పోట్లాడుకోవడం హైలైట్ అయింది. అప్పట్లో వచ్చిన 'శుభలగ్నం' సినిమాలోని సన్నివేశాలను రీ- క్రియేట్ చేశారు. అప్పట్లో జగపతి బాబు ఎలా అయితే తన ఇద్దరు భార్యలు ఆమని, రోజాలను మేనేజ్ చేశారో ఇప్పుడు హైపర్ ఆది ఆ బాధ్యత తీసుకున్నారు. ఆమని దగ్గర వాళ్ళ ఆయన హైపర్ ఆదిని కోనేస్తుంది రోజా. దీంతో మనోడు రెచ్చిపోయి రోజాపై ప్రేమ చూపించడంతో అసూయ చెందిన ఆమని నా మొగుడు నాకు కావాలంటూ పట్టు బడుతుంది. రోజా కూడా అదే మాట అంటూ హైపర్ ఆది చేయి విడువలేదు. దీంతో 'మీరెప్పుడన్నా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టుకోవాల్సి వస్తుందని' అంటూ హైపర్ ఆది దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. అది విని దెబ్బకు హైపర్ ఆది చేయి వదిలింది రోజా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fiCDir
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...