Saturday, 8 January 2022

నా జీవితాన్ని మార్చేసిన సినిమా.. అనసూయ ఎమోషనల్

పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సినిమా ఓటీటీలోకి రావడంతో సెలెబ్రిటీలంతా కూడా వీక్షించారు. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ గురించి ప్రతీ ఒక్కరూ ట్వీట్లు పెడుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ సైతం పుష్ప సినిమాను వీక్షించి ప్రశంసల వర్షం కురిపించాడు. అలా మొత్తానికి పుష్ప ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. మరో వైపు పుష్ప వీడియో పాటలు యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్నాయి. ఒక్కో వీడియో పాట మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఇక ఓటీటీలోనూ పుష్ప హాట్ టాపిక్ అవుతోంది. దాదాపు సెలెబ్రిటీలంతా కూడా పుష్పను వీక్షించినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా కూడా తన ఫ్యామిలితో పాటుగా పుష్ప సినిమాను ఇంట్లోనే వీక్షించింది. పుష్ప సినిమాను వీక్షిస్తోన్నట్టు అనసూయ తెలిపింది. నాకు, నా సినీ కెరీర్‌కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ సర్‌కు థ్యాంక్స్. పుష్పను ప్రైమ్‌లో చూడండి అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయ, సునీల్‌లకు పుష్ప సినిమా బాగానే కలిసి వచ్చింది. పుష్ప పార్ట్ వన్‌లో కంటే రెండో భాగంలోనే ఈ ఇద్దరి పాత్ర ఎక్కువగా ఉండోబోతోన్నట్టు కనిపిస్తోంది. మంగళం శీను, దాక్షాయణి పాత్రలు సెకండ్ పార్ట్‌లో ఇంపార్టెన్స్ ఉండబోతోందని అర్థమవుతోంది. సునీల్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్పేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r0POcZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...