Monday, 31 January 2022

కృష్ణ మైల్‌స్టోన్ మూవీపై కన్నేసిన మహేష్ బాబు! ఫ్యాన్స్‌కి ఇది బిగ్గెస్ట్ న్యూస్

క్రమంగా టాలీవుడ్ క్రేజ్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. బాహుబలి సిరీస్ ఇచ్చిన బూస్టింగ్‌తో స్టార్ డైరెక్టర్లు, హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్గెస్ట్ తెలుగు సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం ఆయన అభిమానులను హుషారెత్తిస్తోంది. దాదాపు 5 దశాబ్దాల క్రిందట సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాను రీమేక్ చేయబోతున్నారనే టాక్ బయటకొచ్చింది. తన తండ్రి కృష్ణ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన ఈ సినిమాతో తాను కూడా సరికొత్తగా అలరించాలని, నేటితరం ప్రేక్షకులకు 'అల్లూరి సీతారామరాజు'ను దగ్గర చేయాలని మహేష్ ఫిక్సయ్యారట. ఈ మేరకు టైటిల్ పాత్రలో నటించేందుకు మహేష్ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఓ బిగ్గెస్ట్ డైరెక్టర్‌తో చర్చించారనేది ఇన్‌సైడ్ టాక్. ఇదిలాఉంటే తన తండ్రి కృష్ణ నటించిన అద్భుతమైన చిత్రాలను అస్సలు ముట్టుకోకూడదని మహేష్ అభిప్రాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి 'అల్లూరి సీతారామరాజు' రీమేక్‌కు సంబంధించి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారు? ఒకవేళ 'అల్లూరి సీతారామరాజు' రీమేక్‌‌లో మహేష్ నటించడమే నిజమైతే ఇంతకన్నా బిగ్గెస్ట్ ట్రీట్ ఇంకేముంటుంది అని జనం చర్చించుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మే 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా లైన్‌లో పెట్టారు మహేష్ బాబు. సో.. చూడాలి మరి ఈ 'అల్లూరి సీతారామరాజు' రీమేక్‌‌ పట్టాలెక్కుతుందా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/OngJIS5VM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...