Friday, 7 January 2022

ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న‌ హీరోతో నిధి అగ‌ర్వాల్ ప్రేమాయ‌ణం.. ఒకే ఇంట్లోనే మ‌కాం అంటూ వార్త‌లు!

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను స‌వ్య‌సాచి సినిమాతో ప‌రిచ‌య‌మైన బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌. ఆ సినిమాలో నాగ చైత‌న్య‌తో జోడి క‌ట్టిన ఈ బ్యూటీ త‌ర్వాత చైతు సోద‌రుడు అఖిల్‌తో మిస్ట‌ర్ మ‌జ్నులో ఆడి పాడింది. అందం ఉన్నా అదృష్టం అంత‌గా క‌లిసి రాని ఈ అమ్మ‌డుకి ఇస్మార్ శంక‌ర్ రూపంలో భారీ హిట అందించారు డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. అదే ఊపులో టాలీవుడ్‌లో రెండు సినిమాలకు ఓకే చెప్ప‌డ‌మే కాకుండా ఇటు కోలీవుడ్‌లోనూ అడుగు పెట్టిసింది అందాల నిధి. కోలీవుడ్‌లో జ‌యం ర‌వి, వంటి స్టార్స్‌తో జ‌త క‌ట్టింది. ఇప్పుడు సంక్రాంతికి విడుద‌ల కానున్న హీరో సినిమాలో అశోక్ గ‌ల్లా హీరోగా న‌టించిన హీరో సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న హ‌రి హ‌ర వీర మ‌ల్లు చిత్రంలోనూ ఈ బ్యూటీ భామ‌కు మంచి పాత్రే ద‌క్కింది. కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతుంద‌ని అనుకుంటున్న‌స‌మ‌యంలో ఈ అమ్మ‌డుకి సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఏమా వార్త అని అనుకుంటున్నారా? నిధి అగ‌ర్వాల్ పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్లే బాయ్‌గా పేరున్న హీరోతో నిధి అగ‌ర్వాల్ ప్రేమలో ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రా హీరో తెలుసా? కోలీవుడ్‌కి చెందిన శిలంబ‌ర‌స‌న్‌. కొన్ని రోజులుగా ఈయ‌న పెళ్లి చేసుకోబోతున్నారంటూ లెక్క‌లేన‌న్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో నిధి అగ‌ర్వాల్ - శింబు మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని, ఇద్ద‌రూ స‌హ జీవ‌నం చేస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ కోలీవుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. అస‌లే కోలీవుడ్‌లో న‌య‌న తార‌, హ‌న్సికల‌తో ఫుల్‌గా ప్రేమ క‌థ‌లు న‌డిపిన ఈ హీరో ఇప్పుడు నిజంగానే నిధి అగ‌ర్వాల్‌తో ప్రేమ‌లో ఉన్నాడా? నిజంగానే వీరు పెళ్లి చేసుకుంటారా? లేక గ‌త హీరోయిన్స్‌లాగానే నిధి అగ‌ర్వాల్‌తో ప్రేమ పాఠాలు ముగిసిన త‌ర్వాత శింబు ఈమెకు కూడా బై చెబుతాడా? అనేది తెలియ‌డం లేదు. మ‌రి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న త‌న పెళ్లి వార్త‌ల‌పై నిధి ఎలా రియాక్ట్ కానుందో చూడాలి మ‌రి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eZqAq2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...