Friday, 14 January 2022

సమంతతోనే ఆ సంతృప్తి.. ఆన్ స్క్రీన్ సీక్రెట్ బయటపెట్టిన నాగ చైతన్య !

అక్కినేని నాగ చైత‌న్య 2022 ప్రారంభంలో బంగార్రాజుతో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. గ‌త ఏడాది ఆయ‌న‌కు ల‌వ్‌స్టోరితో సూప‌ర్ డూప‌ర్ హిట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు వెంకీ మామ‌, మ‌జిలీ చిత్రాలతో కూడా వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకున్నారు నాగ చైత‌న్య‌. బంగార్రాజు కోసం బాలీవుడ్ మీడియాతో నాగ చైత‌న్య మాట్లాడారు. సినిమా గురించి, త‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. తండ్రి నాగార్జున చేసే ఆన్ ది స్పాట్ వ‌ర్క్ మీరు చేయాలేనిదేమైనా ఉందా? అని అడిగిగే బిగ్ బాస్ గురించి చెప్పారు చైతు. బిగ్ బాస్ షోను అన్ ది స్పాట్ ఆయ‌న ర‌న్ చేసే తీరు చూసి చాలా ఆశ్య‌ర్య‌పోయాన‌ని త‌న‌లా నేనెప్పుడూ చేయలేన‌ని చెప్పారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న స‌మంత గురించి కూడా ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌, తాను క‌లిసే తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని, త‌ను హ్యాపీగా ఉంద‌ని, నేను కూడా హ్యాపీగా ఉన్నాన‌ని చెప్పి విడాకుల గురించి ఇటీవ‌ల స్పందించిన నాగ చైత‌న్య‌.. రీసెంట్ ఇంట‌ర్వ్యూలోనూ స‌మంత గురించి స్పందించారు. అయితే విడాకుల గురించి చైత‌న్య మాట్లాడ‌లేదు. మీరు న‌టించిన హీరోయిన్స్‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో ఉంటుంది? అని అడిగితే, స‌మంత‌తో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరింద‌ని ఏమాత్రం త‌డుముకోకుండా స‌మాధానం చెప్పారు నాగ చైత‌న్య‌. ఆమిర్ ఖాన్‌తో చైత‌న్య లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో ఆమిర్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి కూడా చైత‌న్య మాట్లాడుతూ ‘‘ఆమిర్ ఖాన్‌గారితో క‌లిసి ప‌నిచేసిన క్ష‌ణాల‌ను మ‌ర‌చిపోలేను. ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌తో ఆయ‌న అంత చ‌క్క‌గా కలిసి పోతారు. ఆయ‌న‌కు ప్ర‌తి క్రాఫ్ట్ మీద అంత మంచి ప‌ట్టుంది. అలాంటి విష‌యాల‌ను నేనెప్పుడూ నేర్చుకోవాల‌నుకుంటాను’’ అన్నారు మన బంగార్రాజు . అక్కినేని నాగార్జున హీరోగా చేసిన సొగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు మూవీ రూపొందింది. ఇందులో నాగార్జున మనవడు చిన బంగార్రాజు పాత్రలో నాగ చైతన్య నటించారు. కృతి శెట్టి హీరోయిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qtWzoL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...