Friday, 28 January 2022

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు ఐదారు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకదాని వెంట మరొకటి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఫిబ్రవరి నెలలో రవితేజ సినిమా విడుల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న రాబోతోన్న ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లోజరిగిందట. అన్ని ఏరియాల్లో మంచి రేటుకు అమ్ముడుపోయింది. మొత్తానికి రవితేజ మార్కెట్ ఇప్పుడు మంచి స్వింగులో ఉంది. క్రాక్ ఇచ్చిన సక్సెస్‌తో ఖిలాడీని మంచి రేటుకే కొనేశారని తెలుస్తోంది. అలా ఖిలాడీ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకే కొనుగోలు చేశారట. ఆల్రెడీ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలను ఇప్పటికే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ, డింపుల్ హయతి కాంబినేషన్, ఆ జోడి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఫుల్ కిక్ సాంగ్ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టుంది. మొత్తానికి రవితేజ ఖిలాడీ సినిమాతో ఫిబ్రవరి బాక్సాఫీస్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలు రావాలని ప్లాన్ చేస్తున్నాయట. ఇకపై ఫిబ్రవరి నుంచి ప్రతీ రెండు వారాలకు ఒక పెద్ద సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఖిలాడీ సినిమా కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KU1Y0s
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...