Thursday, 13 January 2022

Bangarraju: విడుదలకు ముందే అక్కినేని హీరోల హవా.. సంక్రాంతికి సరికొత్త రికార్డులు!!

అక్కినేని వారసులు , కలిసి నటించిన చిత్రం ''. ‘మనం’ సినిమా తర్వాత మరోసారి ఈ సినిమాతో తెరపంచుకోబోతున్నారు ఈ తండ్రీ కొడుకులు. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ సక్సెస్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ సన్నివేశాలు జోడిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఇతర అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది. సంక్రాంతి బరిలోంచి భారీ సినిమాలు తప్పుకోవడం, చిత్రంలో నాగ్- చైతూ తెరపంచుకోనుండటం ఈ సినిమాకు ఓ రేంజ్ హైప్ తెచ్చిపెట్టింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ మూవీ విడుదలకు ముందే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా 'బంగార్రాజు' కావడంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ నెలకొంది. దీంతో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి నైజాంలో 211, సీడెడ్‌లో 130, ఆంధ్రాలో 335 వరకూ అంటే మొత్తంగా 675 నుంచి 700 థియేటర్లు కేటాయించారని తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో బంగార్రాజు సందడి చేయనున్నారట. మొత్తంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్‌లో రిలీజ్ కావడమనేది నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ రికార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. సో.. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు వసూళ్లు ఎలా ఉంటాయనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zUmFUY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...