Saturday, 22 January 2022

Akhanda హవా.. ఆ మాటకు నవ్వేసిన తమన్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా అఖండ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. అయితే ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో.. అంతకు మించి అన్నట్టుగా ఓటీటీలో దుమ్ములేపుతోంది. మొత్తానికి సినిమా మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టర్‌లో అదరగొట్టేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్‌లోనే ఉంది. ఇక 24 గంటల్లో అఖండ దుమ్ములేపేసింది. ఇది సరి కొత్త రికార్డ్ అని, తెలుగులో ఏ సినిమా కూడా ఇంత మంది ఇంత వేగంగా చూడలేదని చెబుతున్నారు. మొత్తానికి అఖండ సీన్స్, బీజీఎంలను షేర్ చేస్తూ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ తమన్ నేపథ్య సంగీతం గురించే మాట్లాడుతున్నారు. టీవీల స్పీకర్లు పగిలిపోతోన్నాయన్నా.. ఏం కొట్టావ్.. దుమ్ములేపేశావ్ అంటూ తమన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు తమన్ నవ్వేశాడు. ఓ ఎన్నారై ఫ్రెండ్‌తో మాట్లాడాను.. సౌండ్ సిస్టం కంపెనీలు తమన్‌కు థ్యాంక్స్ చెప్పాలి.. మనం కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోని రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నాం.. కానీ గత రెండు రోజుల్లో అమ్ముడైన సౌండ్ సిస్టంల గురించి చెప్పుకోవడం లేదు.. బాలయ్య మ్యాజిక్, తమన్ మ్యూజిక్.. టీవీలన్నీ కూడా మినీ హోం థియేటర్లుగా మారిపోయాయ్ అని అన్నాడు. ఆ ట్వీట్‌ని చూసిన తమన్.. హహహహ అని నవ్వేశాడు. కొత్త సౌండ్ సిస్టమ్‌లు కొంటున్నారా సూపర్ అని అన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Awcnuz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...