Tuesday, 18 January 2022

మెగా 154 .. రోజుకీ రవితేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ మామూలోడు కాదురా బాబు అని సినీ వ‌ర్గాల్లో టాక్ ఈ మ‌ధ్య బ‌లంగానే వినిపిస్తోంది. సాధార‌ణంగా ఈయ‌న వివాదాల‌కు చాలా దూరంగా ఉంటారు. త‌న ప‌ని.. సినిమాలు చేయ‌డం అన్న‌ట్లే ఉంటారు. ఏక‌ధాటిగా వ‌రుస సినిమాలు చేస్తూ ఓ ప్రాజెక్ట్ పూర్తి కాగానే, కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తున్నారు. ఈయ‌న స్పీడు చూసి ఇత‌ర కుర్ర హీరోలు సైతం నోరెళ్ల బెట్టుస్తున్నారు మ‌రి. సినిమాలు ఏక‌ధాటిగా చేయ‌డం అంటే ఏ సినిమా ప‌డితే ఆ సినిమా చేసేయాల‌ని కాకుండా త‌న అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తూ సాగిపోతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా భారీగానే పెంచేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ పెంచిన త‌ర్వాతే ర‌వితేజ ఇంకా ఎక్కువ సినిమాలు వ‌స్తున్నాయ‌ని, అందులో ఆయ‌న డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంచుకుని చేస్తున్నార‌ని కూడా టాక్ బాగానే వినిపిస్తోంది. ఇప్పుడు ర‌వితేజ చేతిలో విడుద‌ల కావాల్సిన సినిమాలు, సెట్స్‌పైకి వెళ్లిన సినిమాలు, వెళ్లాల్సిన సినిమాలు కూడా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా ఓకే చేశారు. అదెవ‌రిదో కాదు.. మెగాస్టార్ హీరోగా డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న . ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా కనిపించబోతున్నారు. అప్పుడెప్పుడో అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ మ‌ళ్లీ అన్న‌ద‌మ్ములుగా క‌నిపిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు చిరు 154లో ర‌వితేజ ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఏడెనిమిది రోజుల చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంది. మ‌రి ఇన్ని రోజుల‌కు ర‌వితేజ ఎంత రెమ్యున‌రేష‌న్ అడిగి ఉంటారోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే మూవీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు ర‌వితేజ రోజుకు పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అడిగార‌ట‌. అంటే దాదాపు రెండు కోట్లు రూపాయ‌ల‌న్న‌మాట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ కూడా ఆ మొత్తం ఇవ్వ‌డానికి ఓకే చెప్పేశార‌ని న్యూస్‌. ఓ రోజుకు పాతిక ల‌క్ష‌లు తీసుకోవ‌డం అంటే నిజంగా గొప్ప విష‌య‌మేన‌ని ర‌వితేజ ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ ఆల్ రెడీ స్టార్ట్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GDjOlZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...