Thursday, 6 January 2022

మెగాస్టార్ 154... చిరుకి జోడి దొరికేసిందట.. ఎవరా భామ!

మెగాస్టార్ 154వ చిత్రాని డైరెక్ట‌ర్ బాబీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మెగా ఫ్యాన్స్‌ను, సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ప‌క్కా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉంటుంద‌నేది ఆ మ‌ధ్య‌లో చిన్న లుక్ ద్వారా ట‌చ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంత మాస్ గెట‌ప్‌లో చిరంజీవి సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ.. సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్.. చిరంజీవి జోడిగా న‌టించ‌నుంద‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ చేసిన శ్రీమంతుడులో శ్రుతి హాస‌న్ హీరోయిన్. అప్పుడు ఉన్న అసోసియేష‌న్‌.. చిరంజీవి వంటి సీనియ‌ర్ స్టార్ సినిమా కావ‌డంతో శ్రుతి సినిమా చేయ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ALSO READ : ల‌వ్ బ్రేక‌ప్ త‌ర్వాత సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకున్న శ్రుతి హాస‌న్‌. క్రాక్‌తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. తెలుగులోనే ఇప్పుడు ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ స‌లార్‌తో పాటు సీనియ‌ర్ స్టార్ హీరో బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇది కాకుండా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితోనూ జోడీ క‌ట్ట‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. చిరంజీవి సినిమాలను పూర్తి చేయడం.. కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తూ చక చకా ముందుకు వెళుతున్నారు. ఆయ‌న దూకుడు చూసిన వారు.. ముఖ్యంగా కుర్ర హీరోలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య‌’ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రో వైపు మ‌లయాళ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్ సెట్స్‌పై ఉంది. ఇది కూడా పూర్తి కావ‌చ్చింది. ఇది కాకుండా మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో ‘భోళా శంకర్’.. బాబీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇవి పూర్తి కాకుండానే రీసెంట్‌గా డివివి దాన‌య్య నిర్మాత‌గా యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల డైరెక్ష‌న్‌లో ఓ సినిమాను అనౌన్స్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GjCQ0J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...