Sunday, 12 December 2021

RRR ఓటీటీ ఆఫర్.. భారీ సినిమాకు క్రేజీ డీల్.. ఇది కదా జక్కన్న సత్తా!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. నేటితరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు తెరపంచుకుంటున్న కారణంగా ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. జనవరి 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఒక్కొక్కటిగా అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలకు రెక్కలు కడుతోంది. ఈ నేపథ్యంలో RRRకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం మేరకు RRR మూవీ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు టాక్. విడుదలకు ముందే దర్శకనిర్మాతలతో బిగ్ డీల్ కుదుర్చుకుందట నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం. 1920 పిరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి గురువారం విడుదల చేసిన ట్రైలర్‌ కేక పెట్టిస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. దీంతో ఈ ట్రైలర్ పలు రికార్డులు తిరగరాస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమాలో ఈ మూవీలో బాలీవుడ్‌ భామ అలియా భట్‌, ఇంగ్లీష్‌ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొమురం భీం రోల్‌లో ఎన్టీఆర్ కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత వస్తున్న ఈ భారీ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pRHewG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...