Thursday, 2 December 2021

Radhe Shyam: పూజా హెగ్డేకి ప్రభాస్ కిస్.. పీక్స్‌లో కెమిస్ట్రీ.. అదరగొట్టేసిన సిద్ శ్రీరామ్

హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న మూవీ అప్‌డేట్స్ ఆ అంచనాలకు రెక్కలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి లవ్ ఆంథెమ్ తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. గత బుధవారం హిందీ వెర్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రబృందం తాజాగా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ లవ్‌ ఆంథమ్‌ని ప్రేక్షకులతో పంచుకుంది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరిపై షూట్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ ‘’ అంటూ సాగిపోతూ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ప్రభాస్, కిస్ సీన్‌తో పాటు ఇద్దరి కెమిస్ట్రీ పీక్స్‌లో ఉంది. ఈ ప్రేమగీతాన్ని సిద్ద్‌ శ్రీరామ్‌ ఆలపించిన తీరు ప్రేక్షకలోకాన్ని ఫిదా చేస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ రాధేశ్యామ్‌’ హిందీ వెర్షన్‌కు మిథున్‌ సంగీతం అందించగా.. మిగిలిన భాషలకు జస్టిన్‌ ప్రభాకరన్ బాణీలు కడుతున్నారు. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్‌ లవర్‌ బాయ్‌ రోల్ పోషిస్తున్నారు. విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుండగా భాగ్యశ్రీ, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్‌-పూజా మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G1Akva
v

No comments:

Post a Comment