Monday, 6 December 2021

జవాబుదారీతనం ఎక్కడుంది?.. ప్రభుత్వాలపై హీరో సిద్దార్థ్ ఫైర్

హీరో రియల్ లైఫ్‌లోనూ హీరోనే. తనకు అనిపించిన భావాలను బయటకు వ్యక్తపరుస్తుంటాడు. ప్రభుత్వాలను నిలదీస్తుంటాడు. సమాజంలోని సమస్యలపై స్పందిస్తాడు. ఎవరు ఎన్నిరకాలుగా ట్రోల్ చేసినా కూడా పట్టించుకోడు. తన దారేదో తానే అన్నట్టుగా ఉంటాడు. తాజాగా మరోసారి సిద్దార్థ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చురకలంటించాడు. నాగాలాండ్‌లో జరిగిన ఘటనపై మీద సిద్దార్థ్ స్పందించాడు. నాగాలాండ్‌లోని మయన్మార్‌ సరిహద్దు మోన్‌ జిల్లాలో భద్రతా బలగాలు శనివారం జరిపిన కాల్పులు ఎంతటి వివాదానికి దారితీశాయో అందరికీ తెలిసిందే. సామాన్య జనాలే.. కానీ తిరుగుబాటుదారులుగా పొరబడి సామాన్య కూలీలపై ఎలైట్‌ యూనిట్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బలగాలను చుట్టుముట్టి దాడి చేసేశారు. ఈ ఘటనతో పాటు తమిళ నాడులో జరిగిన మరో విషాద ఘటనపైనా సిద్దార్థ్ స్పందించాడు. గత ఏడాది తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఓ విద్యార్థిని కూడా అలానే లాకప్ డెత్ చేశారని సిద్దార్థ్ అన్నాడు. ఈమేరకు సిద్దార్థ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భద్రతా బలగాలు నాగాలాండ్‌లో జరిపిన కాల్పుల్లో అమాయకపు ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. తమిళ నాడులో మరో కస్టోడియల్ డెత్ జరిగింది. ఈ సారి స్టూడెంట్‌ను బలి తీసుకున్నారు. జవాబుదారీతనం ఎక్కడుంది? కాపాడాల్సిన వారే ఇలాంటివి చేస్తుంటే ఇంకెలా? అంటూ సిద్దార్థ్ ప్రభుత్వాలను ప్రశ్నించాడు. కెరీర్ పరంగా సిద్దార్థ్ డౌన్ ఫాల్‌లో ఉన్నాడు. మహా సముద్రం అంటూ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇద్దామని ప్రయత్నించాడు. కానీ మహా సముద్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. దీంతో మళ్లీ సిద్దార్థ్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rFJ0DS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...