Thursday, 9 December 2021

బాలకృష్ణ మ‌రో ఎక్స్‌పెరిమెంట్... ఆధ్యాత్మిక పాత్రలో నందమూరి హీరో !

సీనియర్ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ‌కు ఓ సెప‌రేట్ స్టైల్ ఉంటుంది. మాస్ సినిమాల‌తో పాటు ఎక్స్‌పెరిమెంట్ సినిమాలు చేయ‌డానికి ఆయ‌న ఎప్పుడూ ఆస‌క్తి చూపుతుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో బాల‌కృష్ణ చేసిన‌న్ని డిఫ‌రెంట్ జోన‌ర్స్‌ను మ‌రో హీరో ఎవ‌రూ చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. సోష‌ల్.. జాన‌ప‌ద‌.. హిస్టారిక‌ల్‌.. పౌరాణికం.. సైన్స్ ఫిక్ష‌న‌ల్ మూవీస్ చేసుకుంటూ వ‌చ్చారు. ఇప్పుడు మ‌రో ఎక్స్‌పెరిమెంట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ బాల‌కృష్ణ చేయ‌బోతున్న ప్ర‌యోగాత్మ‌క పాత్ర ఏంటో తెలుసా? హిందూ మతాన్ని వ్యాప్తి చేసిన ఆధ్యాత్మిక గురువు రామానుజ చార్యులు. ఇది టాలీవుడ్ ప్రొడ్యూసర్ సి.క‌ళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్. బాల‌కృష్ణ‌తో చేయాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. బాలయ్య సైతం రామానుజ చార్య‌లు పాత్ర‌లో న‌టించాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే ఇప్పుడు ఆయ‌న వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల కుద‌రడం లేద‌ట‌. ఇది వరకే జై సింహా, రూలర్ సినిమాలను బాలయ్యతో నిర్మించాడు కళ్యాణ్. మరో సినిమా చేయాల్సి ఉండింది. కానీ నందమూరి హీరో బిజీగా మారిపోయారు. బాల‌కృష్ణ కాస్త ఫ్రీ అయిన త‌ర్వాత రామానుజ చార్య‌లు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో సి.క‌ళ్యాణ్ తెలిపారు. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అఖండ‌’తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడో సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సాధించిన భారీ విజ‌యం.. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించిన తీరు చూసిన త‌ర్వాత ఇత‌ర స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఊపిరి పీల్చుకున్నారు. ధైర్యంగా ముందు అడుగు వేస్తున్నారు. ప్ర‌స్తుతం అఖండ సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు బాల‌కృష్ణ‌. త‌దుప‌రి గోపీచంద‌ల్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కాబోయే సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. బాల‌కృష్ణ న‌టించే 107వ చిత్ర‌మ‌ది. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కావాల్సింది. కానీ.. బాల‌కృష్ణ భుజానికి ఆప‌రేష‌న్ కావ‌డం.. ఆయ‌న ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్టర్స్ సూచించ‌డంతో షూటింగ్స్ ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. మరో వైపు బాలయ్య తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EHfvF8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...