Saturday, 25 December 2021

ఈ రోజు కోసం పద్నాలుగేళ్లుగా ఎదురుచూశా : అల్లు శిరీష్

గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అలా ఎందుకు దూరంగా ఉంటున్నాడన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. సినిమా షూటింగ్ కోసమా? అంటే అప్డేట్లు ఏమీ ఇవ్వడం లేదు. అల్లు శిరీష్ ప్రస్తుతం అను ఇమాన్యుయేల్‌తో కలిసి చేస్తోన్న ప్రేమ కాదంటా? అనే ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా ఎప్పుడు వస్తుంది? అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా? అన్న అప్డేట్లు ఏమీ రావడం లేదు. ప్రేమ కాదంటా అనే సినిమా టైటిల్ ఏమో గానీ.. అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ మధ్య మాత్రం లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రకరకాల రూమర్లు పుట్టుకొస్తుంటాయి. షూటింగ్ సెట్‌లో, ఆన్ లొకేషన్, ఆఫ్ లొకేషన్‌లో వీరిద్దరి సన్నిహితం సంబంధానికి రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్ మాత్రం కాస్త ఎమోషనల్ అయ్యాడు. హిందీలో జెర్సీ సినిమాను అల్లు శిరీష్, దిల్ రాజు, నాగ వంశీ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా రాబోతోన్న ఈ మూవీ హోర్డింగ్‌ను చూసి, అందులో అని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఇలా అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని జుహు సర్కిల్‌లో ఓ హోర్డింగ్‌లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను.. మొత్తానికి ఇది జరిగింది అంటూ అల్లు శిరీష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qjrRgO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...