Thursday, 2 December 2021

చిరంజీవితో మొదటి రోజు.. డైరెక్టర్ బాబీ ఎమోషనల్

అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే ఆ దర్శకుడి ఆనందానికి హద్దులుండవు. ఇక తన హీరోతో మొదటి రోజు సెట్‌లో గడిపిన క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. అలా ఇప్పుడు దర్శకుడు గాల్లో తేలిపోతోన్నాడు. వెంకీమామ హిట్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు బాబీ. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాను తీస్తున్నాడు. మెగాస్టార్ 154వ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలకు టాప్ దర్శకులందరూ విచ్చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారట. నేడు మొదటి రోజు సెట్‌లో చిరంజీవి మీద సీన్స్ తెరకెక్కించారు. సినిమా సెట్‌లోని స్టిల్స్‌తో మైత్రీ మూవీస్, డైరెక్టర్ బాబీ ఓ ఫోటోను షేర్ చేశారు. హైద్రాబాద్‌లో వేసిన సెట్‌లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మొదటి రోజే అరాచకం మొదలైంది. ఇది నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించిన రోజు.. ఒకేసారి ఎంతో సంతోషంగా ఉంది.. నర్వస్‌గా కూడా ఉంది.. మొదటి రోజు సెట్‌లో చిరంజీవి గారు జాయిన్ అయ్యారు. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ కొత్త ప్రయాణం గొప్పగా మొదలైంది. మీ అందరి ఆశీర్వాదం కావాలని బాబీ పోస్ట్ చేశాడు. వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఇతర కాస్టింగ్ విషయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G83qZV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...