Friday, 17 December 2021

పుష్ప మూవీకి భారీ ఎదురుదెబ్బ.. బొక్కబోర్లా పడ్డ పుష్పరాజ్! ఊహించని రీతిలో ఫస్ట్ డే కలెక్షన్స్

ఎన్నో అంచనాల నడుమ నేడు (డిసెంబర్ 17) ప్రపంచవ్యాప్తంగా పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమాలో పుష్ప రాజ్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు బన్నీ. అల్లు అర్జున్- క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అయితే ఒక్క హిందీ భాషలో మాత్రం అల్లు అర్జున్ చతికిలపడ్డారని, అక్కడ ఊహించని విధంగా ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలయింది. అయితే బన్నీ క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 'పుష్ప' హవా నడిచింది. మొదటిరోజు ఈ సినిమా 30 నుంచి 35 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే కన్నడ, మలయాళీ, తమిళ భాషల్లోనూ పుష్ప సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కినట్లు తెలియగా.. ఒక్క హిందీలో మాత్రం పుష్పరాజ్ బొక్కబోర్లా పడ్డారని తెలుస్తోంది. మొదటి నుంచే హిందీ మార్కెట్‌పై పెద్దగా ఫోకస్ పెట్టని పుష్ప బృందం తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని సమాచారం. పుష్ప హిందీ వర్షన్ థియేటర్స్ అన్నీ బోసిపోయి కనిపించాయని తెలుస్తోంది. కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ కూడా లేదని అంటున్నారు. దీంతో రాజమౌళి ముందుగానే ఇది ఉహించి అల్లు అర్జున్‌కి సూచించారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో ఎంటర్ అయ్యారు సుకుమార్. అల్లు అర్జున్- రష్మిక మందన హీరోహీరాయిన్లుగా మాస్ వండర్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు. సో.. ఈ విషయంలో సుకుమార్ ఏ మేర సక్సెస్ అయ్యారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పుష్ప సినిమా మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3E68rRw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...