Thursday, 16 December 2021

ఊ అంటావా పాప ఊఊ అంటావా.. సమంత పాటకు పవన్ కళ్యాణ్ స్టెప్పేస్తే! ఈ అరాచకం మామూలుగా లేదండోయ్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా మ్యానియానే కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న సమంత.. రీసెంట్‌గా 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ జనాలకు పిచ్చెక్కించింది. తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి ఊపు తెప్పించింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప' సినిమాలోని ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ వైపు ఈ పాటతో తమను కామాందులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ పురుష సంఘాలు కేసు పెట్టగా.. మరోవైపు ఇదే పాటను మేల్ వర్షన్‌లో పాడి ఆ పదాలను మహిళలకు ఆపాదించారు కొందరు. 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అనే లిరిక్స్‌నే తీసుకొని 'ఊ అంటావా పాప ఊఊ అంటావా పాప' అని మార్చేశారు. అంతేకాదు సమంత డాన్స్ చేసిన ఈ పాటకు , చిరంజీవి వీడియోలు యాడ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ''తమ్ముడు, అత్తారింటికి దారేది, బిల్లా, సన్నాఫ్‌ సత్యమూర్తి, వేదం, ఖైదీ నెం: 150'' చిత్రాల్లోని క్లిప్పింగ్స్ జోడించి మ్యాజిక్ చేశారు. ‘వాలి’ అనే ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా ఈ పాటను షేర్‌ చేయడంతో వెంటనే వైరల్ అయింది. మేల్‌ వర్షన్‌ సూపరో సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు రేపు (డిసెంబర్‌ 17) విడుదల కాబోతున్న 'పుష్ప' సినిమాలో సమంత పాట చూసి ఎంజాయ్ చేయాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామ్ గ్లామర్ డోస్‌కి తోడు అల్లు అర్జున్ స్టెప్పులతో థియేటర్స్ హోరెత్తిపోయేలా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గెటప్‌తో పాటు రష్మిక మందన, అనసూయ, సునీల్ లుక్స్ మేజర్ అట్రాక్షన్ కానున్నాయట. సుకుమార్- అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు బన్నీ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yyIDwk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...