Friday, 3 December 2021

ఎప్పుడూ అదే పని!.. నిహారికపై చైతన్య కంప్లైంట్.. ఫోటోలతో బుక్ చేసిన భర్త

మెగా డాటర్ ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి వెకేషన్ మోడ్‌లో ఉంది. పెళ్లై ఏడాది అవబోతోన్న సందర్భంగా ఇలా వెకేషన్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిహారిక మాత్రం స్పెయిన్, బార్సిలోనాలో దుమ్ములేపుతుంది. ఇటు నిర్మాతగా హిట్ కొట్టేసింది. ఓసీఎఫ్ఎస్ అనే వెబ్ సిరీస్ ఫుల్ స్పీడులో దూసుకుపోతోంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మీద చిరంజీవి సైతం స్పందించాడు. అలా ఈ చిన్న ఫ్యామిలీ స్టోర్ పెద్ద హిట్ అయింది. మొత్తానికి నిహారిక చాలా రోజుల తరువాత ఓ సక్సెస్ వచ్చింది. నిర్మాతగా నిహారిక మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే ఇప్పుడు నిహారిక మాత్రం తన భర్తతో కలిసి వెకేషన్‌లో ఉంది. ఇంకో వారం రోజులు కూడా విదేశాల్లోనే తిరిగేట్టు కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 9న నిహారిక పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అలా మొదటి యానివర్సరీ స్పెషల్‌గా ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. స్కై డైవింగ్ చేస్తాడు.. నేను కింది నుంచి ఎంకరేజ్ చేస్తాను.. అని నిహారిక అంటుంది. నిహారిక ముందు చేస్తుంది ఆ తరువాత నేను చేస్తాను అంటూ చైతన్య కౌంటర్ వేస్తాడు. నేను అస్సలు చేయను నాకు భయం అంటూ నిహారిక చెప్పేసింది. అయితే స్కై డైవింగ్ చేసేందుకు నిహారిక సిద్దమైనట్టు కనిపిస్తోంది. మరి చేసిందా? లేదా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఇక నిహారిక మాత్రం ఎప్పుడూ ఫోన్‌లోనే బిజీగా ఉంటుందని, ఫోటోలను షేర్ చేశాడు. మళ్లీ కొంచెం సేపు అయ్యాక నిహారిక మరో ఫోటోను కూడా షేర్ చేశాడు. అందులో కూడా నిహారిక ఫోన్‌తోనే బిజీగా ఉందని చైతన్య చూపించాడు. మొత్తానికి నిహారిక చైతన్యలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lx26rA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...