Tuesday, 7 December 2021

చచ్చిపోతాను అని అనుకున్నా!.. విడాకులపై ఎట్టకేలకు నోరు విప్పిన సమంత

విడాకుల విషయం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో సమంత వేరు పడ్డ తరువాత వచ్చిన వార్తలు, ప్రచారం చేసిన రూమర్లు అందరికీ తెలిసిందే. సమంత మీద నానా రకాల రూమర్లు వచ్చాయి. అక్రమ సంబంధాలను సమంతకు అంటగట్టారు. అబార్షన్ చేసుకుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. అయితే వాటిపై సమంత మొదటిసారిగా స్పందించింది. నాగ చైతన్యతో విడిపొయిన తరువాత చనిపోతానని అనుకున్నానంటూ సమంత సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల సమంత ఓ మీడియాతో ముచ్చటించింది. మీరు చేడు రోజులను ఎదుర్కోంటే పర్వలేదు.. వాటి గురించి అర్థం చేసుకోండి.. ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తే దానిని అంగీకరించండి. సమస్యలతో పోరాడుతునే ఉండండి.. అది ఎప్పటికీ అంతంలేని ఓ యుద్ధం అని సమంత చెప్పుకొచ్చింది. ఇది తన సమస్య.. అంటే ఏంటీ.. తాను ఇంకా తన జీవితాన్ని గడపాలి.. తనకు తెలుసు తన జీవితాన్ని ఇంకా గడపాల్సి ఉందని అర్థమంటూ సమంత చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం తాను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కోంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ..తాను ఎంత బలంగా ఉన్నానని తానే ఆశ్చర్యపోతున్నాను అంటూ సమంత తెలిపింది. మొదట్లో తాను చాలా బలహీనురాలిని అనుకున్నానంటూ సమంత పేర్కొంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తాను కృంగిపోయి చనిపోతానని సమంత అనుకుందట.. కానీ ఇంత బలంగా ఉంటాను అనుకోలేదట. ఈరోజు ఇలా ఉన్నానంటే తనకు చాలా గర్వంగా ఉంది.. ఇలా ఎలా ఉన్నానో తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DwgoyU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...