Thursday, 9 December 2021

నాన్నగారి విషయంలోనే అది రివర్స్.. బాలయ్య బాబుపై బ్రాహ్మణి కామెంట్స్! తాత ఎన్టీఆర్ టాపిక్ తీస్తూ..

నందమూరి నటసింహం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే '' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డుల సునామీ సష్టించడమే గాక కలెక్షన్ల ప్రవాహం పారిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బాలయ్య బాబు రోల్ మేజర్ అసెట్ అయింది. ఆయన మాస్ అప్పీయరెన్స్ థియేటర్స్‌లో నందమూరి అభిమానుల చేత గోల పెట్టించింది. అలాగే అఘోరాగా బాలయ్య మేకోవర్ ప్రేక్షకలో కానికి పూనకాలు తెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తుండటంతో కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత సినిమా హాళ్లలో కొత్త శోభ కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వెండితెరపై బాలయ్య బాబు విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఎనర్జీ, కెమెరా ముందు పర్‌ఫార్‌మెన్స్ చూసి ఆశ్చర్యపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా సత్తా చాటుతున్న ఈ సినిమాపై, బాలయ్య బాబు నట విశ్వరూపంపై విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య బాబు కూతురు నారా తన తండ్రి గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి 'అఖండ' సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, అప్పుడు తాత గారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ను పెంచితే.. ఇప్పుడు నాన్నగారు కూడా అదే రిపీట్ చేసి చూపించారని చెప్పింది. గతంలో నాన్నగారు చేసిన అన్ని సినిమాలను మించి 'అఖండ' ఉందని బ్రాహ్మణి తెలిపింది. ఏజ్ పెరిగే కొద్ది ఎనర్జీ తగ్గుతుందని అంటుంటారు.. కానీ నాన్న గారి విషయంలో అది రివర్స్. ఆయన ఏజ్ పెరిగే కొద్ది ఎనర్జీ కూడా ఆంతకంతకూ పెరుగుతూ వస్తోందని, తనకైతే సర్‌ప్రైజింగ్‌గా ఉందని బ్రాహ్మణి చెప్పింది. ఇంట్లో కూడా అయన చాలా ఎనర్జీగా ఉంటూ పిలల్లతో ఆడుకుంటూ ఉంటారని తెలిపింది. తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పిన ఆమె.. మానవ సేవయే మాధవ సేవని నాన్నగారు చెబుతుంటారని చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DDnYYA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...