Tuesday, 21 December 2021

అర్ధరాత్రి వేళ వర్ష, ఇమ్మానుయేల్ షికార్లు! పోలీసుల చేతికి చిక్కిన లవ్ బర్డ్స్ రియాక్షన్ ఇదీ..

జబర్దస్త్ వేదికపై ఎన్నో జోడీలు కనువిందు చేస్తుంటాయి. రొమాంటిక్ స్కిట్స్ చూపిస్తూ జబర్దస్త్ వినోదం పంచుతుంటారు కమెడియన్స్. ఈ జోడీల్లో రష్మీ- సుధీర్ పెయిర్ బాగా పాపులర్ కాగా.. మళ్ళీ అంతటి క్రేజ్ కొట్టేసింది వర్ష- ఇమ్మాన్యుయేల్ జోడీ. జబర్దస్త్ తెరపైనే కాకుండా ప్రతిసారి స్పెషల్ ప్రోగ్రామ్‌లో ఓ రొమాంటిక్ స్కిట్ చేస్తూ ఆకట్టుకుంటోంది ఈ జబర్దస్త్ పెయిర్. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లవ్ బర్డ్స్‌గా యమ ఫేమస్ అయ్యారు ఈ ఇద్దరూ. వీలు కుదిరినప్పుడల్లా చిన్నితెరపై రొమాంటిక్ సాంగ్స్‌కి స్టెప్పులేస్తూ తెగ అట్రాక్ట్ చేసిన ఈ జోడీకి జబర్దస్త్ వేదికపై పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోజా ముందు అటు వర్ష, ఇటు ఇమ్మాన్యుయేల్ తమ తమ ఫీలింగ్స్ బయటపెడుతుండటంతో ఈ ఇద్దరూ ప్రేమ పక్షులు అని ఫిక్సయ్యారంతా. వాటికి బలాన్నిచ్చేలా కొన్ని ప్రోగ్రామ్స్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా రోజా ఈ ఇద్దరి పర్సనల్ పిక్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి కారులో షికార్లు కొడుతుండగా తీసిన ఓ ఫోటో చూపిస్తూ వర్ష, ఇమ్మానియేల్‌ని నిలదీశారు రోజా. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి తమ లవ్ ట్రాక్‌పై పరోక్షంగా హింటిచ్చింది వర్ష. న్యూ ఇయర్ సందర్భంగా '' అనే స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివరి రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఈవెంట్ ప్రసారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో వర్ష, ఇమ్మాన్యుయేల్ చేసిన షికార్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ సీన్స్ హైలైట్ అయ్యాయి. కొత్త సంవత్సరం వస్తోందంటే యువత చేసే ఎంజాయ్ మామూలుగా ఉండదు. పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుంటారు. మద్యం సేవించి రోడ్లపై చక్కర్లు కొట్టేవారు కూడా ఎంతోమంది. అయితే ప్రతి ఏడాది ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించి ప్రజల సేఫ్టీపై దృష్టి పెడుతుంటారు. తాజాగా అదే సందర్భాన్ని స్కిట్‌గా వాడేశారు జబర్దస్త్ కమెడియన్స్. జబర్దస్త్ వేదికపై చేయాల్సిన స్కిట్‌ని హైదరాబాద్ రోడ్లపై చేసేశారు. నూకరాజు, 30 ఇయర్స్ పృథ్వీ పోలీస్ గెటప్స్ వేసి అర్ధరాత్రి వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ సెషన్ నిర్వహిస్తుండగా.. కారులో వర్ష, ఇమ్మాన్యుయేల్ చక్కర్లు కొడుతూ వాళ్లకు దొరికారు. లైసెన్స్ ఏదని పోలీసులు అడగడంతో ప్రేమించుకోవడానికి లైసెన్స్ కూడా కావాలా అనేస్తుంది వర్ష. దీంతో ఈ వీడియో చూసి ప్రత్యక్షంగా చెప్పకున్నా పరోక్షంగా ఈ ఇద్దరూ ప్రేమికులుగా ప్రకటించుకున్నారని చెప్పుకుంటున్నారు జనం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e9mLy6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...