Friday, 3 December 2021

విజయ్ దేవరకొండతో బాలకృష్ణ.. పూరి అలా స్కెచ్చేశారా? బయటకొచ్చిన క్రేజీ అప్‌డేట్

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న '' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్.. ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారట. ఇందుకోసం ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో భాగమవుతున్నట్లు ప్రకటించిన పూరి.. ఇందులో బాలకృష్ణను కూడా భాగం చేశారనే టాక్ బయటకొచ్చింది. ఇదే ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ అంటున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలో ఎంతో కీలకమైన ఓ చిన్న రోల్ చేయించారని సమాచారం. ఈ పాత్ర నిడివి 5 నిమిషాలకు మించి ఉండదని అంటున్నారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ మూవీ చేశారు. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే లైగర్‌లో ఓ ఐదు నిమిషాల రోల్ చేయమని అడిగారట పూరి. దానికి బాలయ్య ఓకే చెప్పారని, ఆ కారణంగానే గతంలో లైగర్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ సెట్స్ మీదకు ఆయన రావడం జరిగిందనే టాక్ నడుస్తోంది. సో.. చూడాలి మరి ఇందులో నిజమెంత వరకు ఉందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oj2LPh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...