Tuesday, 21 December 2021

అల్లు అర్జున్‌పై అనసూయ క్రేజీ ఫీలింగ్స్! నా లైఫ్‌లో మీ స్థానం అదంటూ ఓపెన్ కామెంట్స్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ '' భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దాడి చేస్తోంది. తొలుత ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ నటనతో పాటు సుకుమార్ నేరేషన్, ఇతర నటీనటుల యాక్టింగ్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఎంతో సంతోషంలో ఉన్న చిత్రయూనిట్ నేడు (డిసెంబర్ 21) తిరుపతిలో మాసివ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ సినిమాలో దాక్షాయణిగా పవర్ ఫుల్ రోల్ చేసిన వేదికపై ఆసక్తికరంగా మాట్లాడింది. దాక్షాయణిగా నన్ను చూశాక ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో అని భయపడ్డా కానీ వచ్చింది థాంక్యూ సుక్కు సార్ అంటూ తన మాటల తూటాలు పేల్చింది అనసూయ. ''బన్నీ.. మీరు నా లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియదు. మీ ఆర్మీ ఏదైతే ఉందో నన్ను బాగా తిట్టేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం ఒక పద్దతిలో చెప్పడం జరిగింది. కానీ అది వేరేలా వెళ్ళింది. కానీ అన్నీ అర్థం చేసుకునే పెద్ద హృదయం మీదని ప్రూవ్ చేశారు. చాలా పెద్ద మనసు మీది. మీరు అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఇన్స్పిరేషన్. మీ వేరియేషన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్స్ వర్ణనాతీతం. అందరి తరపున చెబుతున్నా.. ఈ మూవీలో నన్ను తక్కువ చేసి చూపించారని అంటున్నారు. పార్ట్-2లో తిప్పుతా. ఒక స్టైలిష్ స్టార్ ఇంత మాసివ్ స్టార్ అవుతాడని ఊహించలేదు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సుక్కు సర్ మీరిచ్చిన ధైర్యం మాటల్లో చెప్పలేను. ఈ రోజు రంగమ్మత్త, దాక్షాయణి అని పిలుస్తున్నారంటే కారణం మీరు. మీకు థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా చిన్న పదం'' అని అన్నారు అనసూయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yN0jEo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...