Saturday, 25 December 2021

వామ్మో బిగ్ బాస్ జెస్సీ స్పీడు మామూలుగా లేదు!.. కొత్త సినిమా పోస్టర్‌తో హల్చల్

ఐదో సీజన్‌ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. రొమాంటిక్ ట్రాకులు, హగ్గులు, ముద్దులు అంటూ ఐదో సీజన్ నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉండేది. ఇక షన్ను, సిరి, త్రయం అయితే మోజ్ రూమ్‌కే పరిమితమయ్యేవారు. జెస్సీ సీక్రెట్ రూంలోకి, అనారోగ్య కారణాలతో జెస్సీ బయటకు రావడంతో షన్ను, సిరిల ఆట తీరు పూర్తిగా మారిపోయింది. జెస్సీ బయటకు రానంత వరకు ముగ్గురు కలిసి కాస్త స్నేహితుల్లానే కనిపించారు. ఇక జెస్సీ బయటకు వచ్చిన తరువాత సిరి, షన్ను ట్రాక్ కూడా గాడి తప్పింది. బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్తూ వెళ్తూ జెస్సీ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రియాంక, షన్ను, సిరిలకు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి ఉంటే ఇంకాస్త మెరుగు పడేవాళ్లు. మొత్తానికి బయటకు వచ్చిన జెస్సీ మాత్రం అషూ రెడ్డి, శ్వేతా వర్మ, భాను శ్రీ వంటి వారితో పబ్బులు అంటూ తిరుగుతూ హల్చల్ చేశాడు. అయితే బిగ్ బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్లందరిలోనూ జెస్సీ ముందులో ఉన్నాడు. ఎందుకంటే హీరోగా మారిన తొలి కంటెస్టెంట్ జెస్సీ. ఈ ఐదో సీజన్‌ కంటెస్టెంట్లకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. విశ్వ, సరయు, లోబో, ఆనీ మాస్టర్లకు మంచి అవకాశాలు వచ్చాయి. ఇక నటరాజ్ మాస్టర్ అయితే ఏకంగా హీరోగా మారిపోతోన్నాడట. తాజాగా జెస్సీ హీరోగా మారిపోయాడు. ఎర్రర్ 500 అంటూ తన కొత్త సినిమా పోస్టర్‌ను బయటకు వదిలాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జెస్సీ అదరగొట్టేశాడు. ఫుల్ యాక్షన్ అండ్ అగ్రెసివ్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. సందీప్ మైత్రేయ దర్శకత్వంలో రాబోతోనన్ ఈ చిత్రాన్ని మైత్రేయ మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3poBtYs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...