Sunday, 26 December 2021

పాము కాటుపై సల్మాన్ ఖాన్ వివరణ.. ఆ విష సర్పం ఎన్నిసార్లు కాటేసిందంటే! హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన హీరో

బాలీవుడ్‌ స్టార్‌ హీరో పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. పన్వేల్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి ఆయనను ఓ పాము కాటేయడంతో స‌ల్మాన్ భాయ్ వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆయ‌నను వెంట‌నే ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సల్మాన్‌ని ప‌రిశీలించిన వైద్యులు భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని, ఆరోగ్య ప‌రంగా ఎలాంటి ఇబ్బంది లేద‌ని తేల్చిచెప్పడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా తాను పాము కాటుకు ఎలా గురయ్యాననే విషయాన్ని స‌ల్మాన్ స్వయంగా వెల్లడించారు. ''నా ఫామ్‌ హౌస్‌లోకి ఓ పాము రావడంతో దాన్ని నేను కర్రతో బయట వదిలేద్దామని తీసుకెళ్లబోయాను. కానీ ఆ పాము మెల్లగా నా చేతిపైకి వచ్చేసింది. దాన్ని పట్టుకుని విడిపించడానికి చాలా ప్రయత్నించా. ఆ సమయంలోనే నన్ను మూడు సార్లు కాటేసింది. అది ఓ రకమైన విషపూరిత పాము. ఆ సర్పం కాటేసిన అనంతరం 6 గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా" అని సల్మాన్ ఖాన్ చెప్పారు. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్మాన్‌ ఖాన్ తిరిగి తన ఫామ్‌ హౌస్‌ చేరుకున్నారని సమాచారం. ఇకపోతే నేడు (డిసెంబర్‌27) సల్మాన్ 56వ పుట్టిన రోజు కావడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు. ప్రస్తుతం సల్మాన్.. ‘ఏక్‌ థా టైగర్’ సీక్వెల్‌, ‘టైగర్‌ 3’ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా తన 56వ పుట్టిన రోజు ప్రేక్షకులకు సరైన ట్రీట్ ఇచ్చారు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్. తన తదుపరి మూవీ టైటిల్‌ను ఆయనే స్వయంగా ప్రకటించారు. తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “భజరంగి భాయిజాన్” సీక్వెల్ టైటిల్‌ రివీల్ చేశారు సల్మాన్. ఈ చిత్రానికి ‘పవన్ పుత్ర భాయిజాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3esEAs4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...